/rtv/media/media_files/2025/01/02/grRiAMp2oICATHmX0uII.jpg)
horoscope 2025 today
ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నేటి రాశీ ఫలాలు
మేష రాశి : మేష రాశీ వారికీ ఈరోజు శుభ సూచకంగా ఉండబోతుంది. ఈ రోజు మేష రాశి వారు కొన్ని చిన్న విజయాలు సాధించగలుగుతారు. అలాగే అనుకున్న పనుల్లో కొంత ఆలస్యం ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వృషభ రాశి: మీ సామర్థ్యాలను పర్యవేక్షించడంలో బాగా ముందుకు వెళతారు. అలాగే సన్నిహిత సంబంధాలలో ఆత్మీయత పెరుగుతుంది.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈరోజు సామాజిక సంబంధాలు మరింత బలపడతాయి. అలాగే కొన్ని విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ దైర్యంగా ఉండడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు.
కర్కాటక రాశి: ఈ రోజు కర్కాటక రాశి వారు కొంత భావోద్వేగానికి లోనవుతారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు మంచి అనుభూతిని ఇస్తుంది.
Also Read : నేను చెప్పినట్లే ఆడాలి.. టీమిండియా కోచ్ కీలక ఆదేశాలు
సింహ రాశి: ఈరోజు సింహ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపార లేదా ఆర్థికంగా ప్రయోజనకరమైన అవకాశాలు రావచ్చు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కన్యా రాశి: ఈరోజు కన్య రాశి వారు మంచి ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్యం, శారీరక శక్తి పెరుగుతుంది. (Horoscope)
తులా రాశి: మీరు ఈ రోజు కొంత కష్టపడవచ్చు, కానీ చివరికి మంచి ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్న కార్య సాధన పూర్తిచేయడానికి కుటుంబం, సన్నిహితుల నుంచి మద్దతు అందుతుంది.
వృశ్చిక రాశి: ఇంట్లో శాంతి, ఆనందం ఉంటుంది. ఆర్థిక లాభాల విషయాల్లో రిస్క్ తీసుకోడాన్ని నివారించండి.
ధనుస్సు రాశి: ఈ రాశివారు కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులకు ప్రేరణ పొందుతారు. వారు చేసే ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది.
మకర రాశి: మీ కృషి పట్ల మీరు ఆనందాన్ని పొందుతారు. సామాజిక మద్దతు వృద్ధి చెందుతుంది.
కుంభ రాశి: ఈ రోజు కుంభ రాశి వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. నిపుణులతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. కాకపోతే వ్యక్తిగత విషయాల్లో కాస్త జాగత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మీన రాశి: మీరు చేసే పనుల్లో విశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబానికి మంచి బలమైన మద్దతు ఉంటుంది.
Also Read : న్యూ ఇయర్ కిక్కు.. వామ్మో ఒక్కరోజులోనే అంత తాగారా?
గమనిక: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు, సూచనల కోసం పండితులను సంప్రదించగలరు.
Also Read : ఒకే రోజు 16 సూర్యోదయాలు చూసిన సునీతా విలియమ్స్