Ap: ఏపీలో న్యూ ఇయర్ కిక్కు బాగా కనిపించింది.. 2024కు ఘనంగా వీడ్కోలు చెబుతూ 2025కు స్వాగతం పలుకుతూ పార్టీలు గట్టిగానే చేసుకున్నట్లు కనపడుతుంది. డిసెంబరు 31వ తేదీ ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు దాదాపు రూ.200 కోట్ల విలువైన మద్యాన్ని గుటాకాయ స్వాహా చేశారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు మద్యం వీరులు. Also Read: Tirumala: తిరుమలలో కియోస్క్ మెషిన్ ప్రారంభం.. డబ్బులు లేకపోయినా పర్లేదు 1700కోట్ల విలువైన మద్యం విక్రయాలు.. ఏపీ ప్రభుత్వం మద్యం షాపులు, బార్లు, క్లబ్బుల్లో మరో 2 గంటలపాటు అదనంగా విక్రయాలకు అనుమతి ఇచ్చింది.దీంతో దొరికిందే ఛాన్స్ అని దాదాపు 14 గంటల పాటూ మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చేసింది. దాదాపు 14 గంటల పాటు మద్యం అమ్మకాలు అయితే కనుక.. గంటకు సగటున రూ.14.28 కోట్ల లెక్కన మద్యం అమ్మకాలు జరిగినట్లు లెక్కలు బయటకు వస్తున్నాయి. గతేడాది రూ.1500కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరిగితే.. ఈసారి అందుకు అదనంగా మరో రూ.200 కోట్లు కలుపుకొని రూ.1700కోట్ల విలువైన మద్యం విక్రయాలు కేవలం 7 రోజుల్లోనే జరిగిపోయాయి. Also Read: Time Travel Flight: రియల్ లైఫ్ టైమ్ ట్రావెలర్.. 2025 నుంచి 2024కు వెళ్లిన విమానం! రాష్ట్రవ్యాప్తంగా కొత్త సంవత్సరం కోసం మూడు రోజుల ముందే.. అంటే డిసెంబర్ 29నే మద్యం స్టాకును డిపోల నుంచి షాపులకు చేరవేసేశారు. కానీ ఈ ఏడాది మాత్రం అలా జరగలేదు.. డిసెంబరు 30, 31వ తేదీల్లో రూ.331.85 కోట్ల విలువైన మద్యాన్ని షాపులకు వేశారు. 31వ తేదీ ఒక్కరోజే 2.50 లక్షల ఐఎంఎల్ కేసులు, 75 వేల బీరు కేసులు విక్రయం జరిగినట్లు తెలుస్తుంది. Also Read: Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా.. దీని విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో మాత్రం రోజుకు రూ.80 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి షాపులకు తీసుకెళ్లారు. Also Read: CM Revanth: నేను మారాను.. మీరు కూడా మారండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు అయితే కొత్త సంవత్సరం సందర్భంగా అందుకు రెండు రెట్లు అధికంగా స్టాకును తీసుకువెళ్లారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు గట్టిగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ 24గంటల తనిఖీలు చేపట్టారు అధకారులు. దీంతో రాష్ట్రంలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు పెరిగాయని తెలుస్తుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల యజమానులకు మార్జిన్‌ను 10శాతం నుంచి 14శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.