Salt Water: ఉప్పు నీటితో ఇలా చేస్తే.. ఎంత గాఢ నిద్ర వస్తుందో తెలుసా..?

నిద్రసరిగా పోకపోతే ఎన్నో ఆనారోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమితో బాధపడేవారికి ఉప్పునీరు ఉత్తమ ఔషధం. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కాసేపు గోరువెచ్చని ఉప్పునీటిలో పాదాలను నానబెట్టడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరగటంతోపాటు మంచిగా నిద్రపడుతుంది.

New Update
salt water

Salt Water

Salt Water: రోజంతా పనిచేసి అలసిపోయి ఉన్నవారికి రాత్రి సమయంలో నిద్రసరిగా పట్టదు. చాలా మంది నిద్రమాత్రలు వేసుకుంటారు. కొందరు అయితే నిద్రపట్టక టీవీ, స్మార్ట్‌ఫోన్లు చూస్తూ ఉంటారు. మరికొందరు కొన్ని పాలుతాగి పడుకుంటారు. ఉదయం అంతా శ్రమచేసి ఇంటికి వచ్చాక బాడీ పెయిన్స్‌, ఒత్తిడి కారణంగా నిద్రసరిగా పట్టదు. వైద్యులు సైతం నిద్రపట్టేందుకు కొన్ని టాబ్లెట్స్‌ని ఇస్తుంటారు. మరికొందరు బాగా ఆలోచనలు, ఆర్థిక కష్టాల గురించి ఆలోచిస్తూ నిద్రసరిగా పోరు. నిద్రసరిగా పోకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖం పాలిపోతుంది. అంతేకాకుండా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా నిద్రపోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

మంచిగా నిద్రపడుతుంది:

నిద్రలేమితో బాధపడేవారికి ఉప్పునీరు ఉత్తమ ఔషధం. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కాసేపు గోరువెచ్చని ఉప్పునీటిలో పాదాలను నానబెట్టడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఉప్పు నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల శరీరానికి ఉపశమనం లభిస్తుంది. శరీరం ఉత్సాహంగా మారుతుంది. ఉప్పు నీరు శరీరానికి మెగ్నీషియం అందించి కండరాల వాపును తగ్గిస్తాయి. మంచిగా నిద్రపడుతుందని నిపుణులు అంటున్నారు. ఆర్థరైటిస్ సమస్య వల్ల కొంతమందికి నిద్ర సరిగా పట్టదు. రాత్రిపూట మీ పాదాలను వేడి నీటిలో ఉప్పుతో నానబెట్టడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి: పాలు లేకుండానే వెన్న తయారు చేస్తున్న కంపెనీ

వేడి నీళ్లలో ఉప్పు కలిపి పాదాలను నానబెట్టడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చేతులు, కాళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. అలాగే పడుకునే ముందు ఉప్పునీటితో పుక్కిలించి ఊస్తే నోటిలోని క్రిములన్నీ పోతాయి. పాదాలకు కాస్త కొబ్బరినూనెతో మసాజ్‌ చేసుకున్నా మంచిగా నిద్రపడుతుందని నిపుణులు అంటున్నారు. ఉప్పు క్రిములు, కీటకాలను పారదోలుతుంది. అంతేకాకుండా నొప్పులను తగ్గించే గుణం ఇందులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: గ్యాస్‌ మాత్రలతో మరిన్ని రోగాలు ఖాయమా?

ఇది కూడా చదవండి: జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ సమస్య మీకు ఉన్నట్లే!

 

ఇది కూడా చదవండి: చూసేందుకు చిన్న చేప..సౌండ్‌ మాత్రం సాలిడ్‌గా ఉంటుంది

Advertisment
Advertisment
తాజా కథనాలు