Fish: చూసేందుకు చిన్న చేప..సౌండ్‌ మాత్రం సాలిడ్‌గా ఉంటుంది

డానియోనెల్లా సెరిబ్రమ్ అనే చేప చాలా చిన్న చేపల జాతికి చెందినది. తాజాగా చేసిన పరిశోధనలో 10-12 mm నుంచి దాని ధ్వని 140 dB మధ్య దీని సౌండ్‌ ఉంటుందట. దాని సోనిక్ కండరాలు, డ్రమ్మింగ్ మృదులాస్థిని ఉపయోగించి చేపలు పెద్ద శబ్ధం చేస్తుందని గుర్తించారు.

New Update
Danionella cerebrum fish

Danionella Cerebrum Fish

Danionella Cerebrum Fish: మన భూమిపై మనకు తెలియని ఎన్నో జంతువులు ఉన్నాయి. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఒక్కో జంతువు, జీవికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. అందులో భాగమే ఈ చేప.. చూసేందుకు చిన్నగా ఉన్నా సౌండ్‌ మాత్రం దద్దరిల్లిపోతుందని చెబుతున్నారు. మనం నిత్యం చాలా రకాల చేపల గురించి వింటుంటాం.  ఈ చేప చూసేందుకు గోరు సైజులో ఉన్నా జెట్ ఫైటర్ కంటే తక్కువేమీ కాదంటున్నారు. డానియోనెల్లా సెరిబ్రమ్ అనే ఈ చేప 1980 సంవత్సరంలో కనుగొనబడింది. అయితే దీనిని 2021 సంవత్సరంలో గుర్తించారు. 

పెద్దశబ్ధం చేస్తున్న చేపలు:

ఇది చాలా చిన్న చేపల జాతికి చెందినది. దాని పరిమాణం గోరు సైజులో ఉంటుంది. తాజాగా ఈ చేప గురించి ఆసక్తికరమైన విషయం పరిశోధకులు తెలుసుకున్నారు. దాని సోనిక్ కండరాలు, డ్రమ్మింగ్ మృదులాస్థిని ఉపయోగించి చేపలు పెద్ద శబ్ధం చేస్తుందని గుర్తించారు. 10-12 mm నుంచి దాని ధ్వని 140 dB మధ్య దీని సౌండ్‌ ఉంటుంది. సరళమైన భాషలో చెప్పాలంటే ఇది విమానం ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో చేసే శబ్దంతో సమానం అంటున్నారు. 

ఇది కూడా చదవండి:హైదరాబాద్‌లో విషాదం.. స్కూల్‌ గేటు మీద పడి విద్యార్థి మృతి

సెన్కెన్‌బర్గ్ నేచురల్ హిస్టరీ కలెక్షన్స్‌లోని శాస్త్రవేత్త డాక్టర్ రోల్ఫ్ బ్రిట్జ్ ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. ఇది చిన్న జీవి అయినా ధ్వని చాలా బిగ్గరగా ఉందని, దీని కంటే పెద్ద శబ్దం చేసే జీవులు లేవని కాదని, సాధారణంగా నిశ్శబ్దంగా భావించే చేపలకు ఇంత పెద్ద ధ్వని ఉండటం నమ్మలేని నిజం అంటున్నారు. వీడియో రికార్డింగ్‌లో ఈ ధ్వని చేపల ఈత మూత్రాశయం దగ్గర ఉన్న పక్కటెముక నుండి వస్తుందని గుర్తించామని చెప్పారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

ఇది కూడా చదవండి: భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా?

Advertisment
తాజా కథనాలు