Butter: పాలు లేకుండానే వెన్న తయారు చేస్తున్న కంపెనీ

కాలిఫోర్నియా ఆధారిత స్టార్టప్ సావర్ కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్‌ను మాత్రమే కలపడం ద్వారా వెన్నను తయారు చేసింది. వెన్న కార్బన్, హైడ్రోజన్ అణువులతో తయారు చేశారు. కంపెనీ థర్మోకెమికల్ ప్రక్రియ ద్వారా దీనిని తయారు చేసింది.

New Update
butter

Butter

Butter: ప్రస్తుత కాలంలో సాంకేతిక విషయాల నుంచి ఆహారం, పానీయాల వరకు టెక్నాలజీ పెరిగిపోయింది. అనేక ప్రాసెస్ చేయబడిన ఆహారాలు మార్కెట్లోకి వచ్చాయి. సహజసిద్ధమైన ఆహారాలకు కృత్రిమ ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. పాలు, వెన్న, చీజ్, ఐస్ క్రీం వంటి వాటి కోసం మనం ఆవులు, గేదెలు, పాలు ఇచ్చే జంతువులపై ఆధారపడాలి. అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ మరో ఆలోచనతో ముందుకు వచ్చింది. పాలు లేకుండా పాల ఉత్పత్తులను తయారు చేయబోతోంది. 

వెన్న తయారీ:

ఈ కంపెనీ పేరు Savor. పాలతో సంబంధం లేకుండానే వెన్ననుతయారు చేస్తున్నారు. ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ ప్రకారం కాలిఫోర్నియా ఆధారిత స్టార్టప్ సావర్ కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్‌ను మాత్రమే కలపడం ద్వారా వెన్నను తయారు చేసింది. వెన్న కార్బన్, హైడ్రోజన్ అణువులతో తయారు చేశారు. కంపెనీ థర్మోకెమికల్ ప్రక్రియ ద్వారా దీనిని తయారు చేసింది. ఇది పాలతో తయారు చేసిన ఉత్పత్తులకు పాల రహిత పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ ప్రక్రియ గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేయదు, సాంప్రదాయ వ్యవసాయంలో వెయ్యి వంతు నీటిని ఉపయోగిస్తుంది.

ఇది కూడా చదవండి: ఏపీలో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని ఏం చేశాడంటే..

ఈ విధంగా చేసిన వెన్న రుచి నిజమైన వెన్నలానే ఉందని అంటున్నారు. 2025 నాటికి ఈ ఉత్పత్తి మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని బిల్ గేట్స్ కంపెనీ వ్యవస్థాపకురాలు కాథ్లీన్ అలెగ్జాండర్ చెప్పారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో దాని గురించి రాస్తూ ఇది నిజమైన వెన్న లాంటిదని అన్నారు. ఇందులో గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్, నీటి నుంచి హైడ్రోజన్ తీసుకోబడిందని చెప్పారు. ఇది వేడి చేయడం ద్వారా ఆక్సీకరణం చెందుతుందని, కొవ్వు ఆమ్లాలు దాని నుంచి వేరు చేయబడి నెయ్యిగా కూడా మారుతుందని అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

ఇది కూడా చదవండి: తీర్థం అనుకుని తాగారు.. విషయం తెలిసి షాక్‌

 

Advertisment
Advertisment
తాజా కథనాలు