/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-12T173452.726.jpg)
Vastu Tips
ఇంటి ఆవరణలో పచ్చని మొక్కలు ఉండటం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇంటి పెరట్లో కొన్ని మొక్కలను మాత్రమే నాటాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని మొక్కలను పెరట్లో నాటడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే ఇంట్లో నాటకూడని ఆ మొక్కలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
బ్రహ్మజెముడు
ఇంటి ఆవరణంలో ఈ మొక్కలను నాటడం వల్ల కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని ముళ్లు వల్ల ఎల్లప్పుడూ ఇంట్లో ఆందోళన ఉంటుంది. అందుకే ఈ మొక్కలను ఇంట్లో పెంచకూడదని నిపుణులు చెబుతున్నారు.
రబ్బరు మొక్క
చాలా మంది దీన్ని ఇంట్లో ఉంచుతారు. అయితే దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఎక్కువగా ఆకర్షిస్తుంది. దీంతో కుటుంబంలో సమస్యలు మొదలు అవుతాయి. కాబట్టి వీటిని ఇంట్లో పెట్టవద్దు.
ఇది కూడా చూడండి: Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
తుమ్మచెట్టు
తుమ్మచెట్టును ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంట్లో నిలవదు. ఏదో విధంగా ఖర్చు అవుతూనే ఉంటుంది.
ఇది కూడా చూడండి:RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!
చింత చెట్టు
చింతచెట్టు ప్రతికూల శక్తిని ఎక్కువగా ఆకర్షిస్తుందట. ఈ చెట్టు దగ్గర ఎక్కువగా ఆత్మలు ఉంటాయని అంటుంటారు. అయితే ఈ చెట్టును ఇంటి ఆవరణంలో ఉంచితే ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏ పని తలపెట్టిన కూడా అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి వీటిని అసలు ఇంటి దగ్గర పెంచవద్దు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చూడండి: Horoscope: నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు