ఉదయాన్నే ఈ టీ తాగితే.. బోలెడన్నీ ప్రయోజనాలు

రోజూ ఉదయం మందార టీ తాగడం వల్ల గుండె సమస్యల బారిన పడకుండా ఉంటారు. కాఫీ, టీకి బదులు మందార టీని తాగడం వల్ల రక్తపోటు, ఊబకాయం సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

New Update
Hibiscus Tea

Hibiscus Tea Photograph: (Hibiscus Tea)

మందార టీ ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధుల నుంచి విముక్తి కల్పిస్తుంది. రోజూ ఉదయం మందార టీ తాగడం వల్ల గుండె జబ్బులు, రొమ్ము వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని నిపుణులు అంటున్నారు. మందారంలో సప్లిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. దీంతో గుండె ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు. 

ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

వాపును తగ్గించుకోవచ్చు

మందార టీ తాగడం వల్ల వాపు తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కాలేయం ఉత్పత్తి చేసే సి-రియాక్టివ్ ప్రోటీన్ వంటి వాపు గుర్తులను కూడా తగ్గించడంలో మందార టీ సహాయపడుతుంది.

ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

మధుమేహం

మందారంలోని పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రోజూ కాఫీ, టీ తాగే బదులు మందార టీని తాగడం ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇందులో కేలరీలు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటివి ఉన్నాయి. ఇవి అనారోగ్య సమస్యల బారి నుంచి కాపాడతాయి. బరువును తగ్గించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. 

ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి విముక్తి చెందాలంటే మందార టీ బాగా సాయపడుతుంది. ఇందులోని పోషకాలు ఒక నెల రోజుల్లో మీ బరువును తగ్గిస్తాయి. ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ మందార టీ బెస్ట్ అని చెప్పవచ్చు. మరీ ఎక్కువ బరువుగా ఉంటే ఉదయం, సాయంత్రం వేళలో మందార టీ చేసుకుని తాగవచ్చని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు