/rtv/media/media_files/2025/02/23/LXX0er1WRlU0uteJufME.jpg)
Sleep
నిద్ర ఆరోగ్యానికి మంచిదే. కానీ అతి నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు కాస్త సమయం తీరిక దొరికితే చాలు.. నిద్రపోవడానికి ట్రై చేస్తారు. రోజులో 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే దీన్ని హైపర్నోమ్నియా అంటారు. అధికంగా నిద్రపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
థైరాయిడ్ సమస్యలు..
రోజులో ఎక్కువ గంటలు నిద్రపోతే శరీరంలో మెటబాలిజం తగ్గిపోతుంది. నిద్ర అధికమైనా కూడా యాక్టివ్‌గా అనిపించదు. తొందరగా బరువు పెరుగుతారు. అలాగే మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది. అన్ని విషయాలను కూడా తొందరగా మరిచిపోతారు. వీటితో పాటు గుండె సంబంధిత సమస్యలు, థైరాయిడ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల కండరాలు అలసటకు గురి అవుతాయి. దీంతో కండరాల నొప్పి రావడంతో పాటు వెన్నునొప్పి కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
తక్కువ నిద్ర అయితే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అలాగే అతి నిద్ర అయినా కూడా డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. 15 శాతం మందికి అతిగా నిద్రపోవడం వల్ల డిప్రెషన్ వస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది.
ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.