చలికాలంలో చర్మంతో పాటు జుట్టు కూడా ఎక్కువగా దెబ్బతింటుంది. దీంతో జుట్టు చివర్లు చీలిపోవడం, పెరుగుదల పూర్తిగా ఆగిపోవడంతో పాటు బలహీనంగా మారి రాలిపోతుంది. ఈ శీతాకాలంలో జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. ఇది కూడా చూడండి:AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి చివరలను కత్తిరించండి జుట్టు చివరలను వదిలేయకుండా అప్పుడప్పుడైనా కట్ చేయండి. దీనివల్ల జుట్టు పెరుగుతుంది. కనీసం ఆరు వారాలకు ఒకసారి అయిన జుట్టును కత్తిరించండి. హీట్ స్టైలింగ్ వాడవద్దు స్ట్రెయిట్‌నర్, కర్లర్‌ల వంటి హీట్ స్టైలింగ్‌ను వాడకూడదు. వీటివల్ల జుట్టు బలహీన పడుతుంది. శీతాకాలంలో మీ జుట్టు చివర్లు చీలిపోయే సమస్య పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వాడవద్దు. ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్! వాటర్ ఎక్కువగా తాగండి జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా పెరగాలంటే మాత్రం వాటర్ ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. బాడీ హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఆయిల్ అప్లై చేయండి కొందరు ఫ్యాషన్‌కి అలవాటు పడి జుట్టుకి ఆయిల్ అప్లై చేయరు. రోజూ తలకి జుట్టు రాయకపోయిన కనీసం వారానికి రెండు నుంచి మూడు సార్లు అయిన జుట్టుకి ఆయిల్ అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి, ఆముదం, బాదం వంటి ఆయిల్స్ అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు పెరుగు అప్లై చేయాలి జుట్టు చివర్లు పగుళ్లు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఒకసారి జుట్టుకి పెరుగు అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు చివర్లు పగుళ్లు తగ్గుతుంది. అలాగే జుట్టు మృదువుగా, అందంగా తయారవుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చూడండి: TS: గ్రామ సభల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ