/rtv/media/media_files/2025/07/10/guru-purnima-2025-07-10-10-19-59.jpg)
Guru Purnima
దేశ వ్యాప్తంగా నేడు గురు పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ గురు పౌర్ణమి అనేది చాలా పవితమైనది. ఈ రోజున గురువులకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు గురువులను పూజించడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే నేడు కొందరు చేయకూడని కొన్ని పనులు చేస్తుంటారు. దీనివల్ల దరిద్రమంతా కూడా వారితోనే ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ పవిత్రమైన గురు పౌర్ణమి నాడు చేయకూడని ఆ తప్పులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం
గురువులను అగౌరవ పరచడం
గురు పౌర్ణమి రోజున గురువులను లేదా గురువుతో సమానమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌరవపరచకూడదు. వారికి కోపం తెప్పించడం లేదా వారిని విమర్శించడం వంటివి చేయకూడదు. దీనివల్ల సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన
అబద్ధాలు చెప్పడం
ఈ పవిత్రమైన రోజున అబద్ధాలు చెప్పడం లేదా మోసపూరితమైన పనులు చేయడం వంటివి మానుకోవాలి. పొరపాటున చేయడం వల్ల ఇంటికి దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు.
మాంసాహారం తినడం
కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి వారు గురు పౌర్ణమి అని పాటించకుండా మాంసాహారం తింటారు. ఇలా తినడం, మందు వంటివి సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదని పండితులు చెబుతున్నారు. మాంసాహారం వంటివి సేవించడం వల్ల పాపం పెరుగుతుందని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్..ఎక్కడంటే?
గొడవ పడకూడదు
ఈ రోజు అసలు వాదించకూడదు. ఇతరులతో అసలు గొడవ పడకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ఇతరులపై ద్వేషంతో అసలు ఉండకూడదని పండితులు చెబుతున్నారు.
పరిశుభ్రత లేకపోవడం
ఈ రోజు పరిశుభ్రత పాటించాలని పండితులు చెబుతున్నారు. అలాగే స్నానం చేయకుండా గురువులను పూజించడం లేదా ఇతర శుభ కార్యాలు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి:Youtube: యూట్యూబర్లకు షాక్.. ఇకనుంచి ఆ వీడియోలకు డబ్బులు రావు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
puja | teachers | Guru Purnima 2025