/rtv/media/media_files/2025/05/20/HwbEW6HY671c9BfKmMbH.jpg)
Relationship Tips for boys
అబ్బాయిల్లో అమ్మాయిలు కేవలం అందం, ఆస్తి, హోదా మాత్రమే చూడరు. ఒక అబ్బాయి అందంగా ఉండి ధనవంతుడు అయినా కూడా అతనిలో నిజాయితీ లేకపోతే అసలు అమ్మాయిలు ఇష్టపడరని చాణక్యుడు చెబుతున్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, నిజాయితీగా ప్రతీ విషయంలో ఉండే అబ్బాయిలను ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడతారట. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడతారు. భాగస్వామితో సమయం గడపాలని భావిస్తారు.
ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
నమ్మకంగా ఉన్న అబ్బాయిలను ఎక్కువగా..
ఇలా అమ్మాయి చెప్పే అన్ని మాటలను శ్రద్ధగా వినే అబ్బాయిలని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఒకరి మాటలను ఒకరు గౌరవించుకుని ఇలా ఉండటం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధం కూడా పెరుగుతాయని చాణక్య నీతి చెబుతోంది. అమ్మాయిలు ఒక్కసారి అబ్బాయిని నమ్మితే జీవితాంతం నమ్ముతారు. వారి కోసం ఏదైనా చేయడానికి కూడా వెనుకాడరు. అయితే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారినే అమ్మాయిలు ఇష్టపడతారు.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..
తప్పుడు మాటలు చెప్పి మనుషులతో ఆడుకునే వారి కంటే నిజాయితీ, నమ్మకం ఉన్నవారిని ఇష్టపడతారు. అన్నింటి కంటే ముఖ్యంగా అమ్మాయిని గౌరవించలేని అబ్బాయిని అసలు ఇష్టపడరు. ప్రతీ మహిళ తనకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటుంది. తనని తానుగా గుర్తించిన అబ్బాయితోనే జీవితాంతం గడపాలని భావిస్తుంటుంది.
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. వీటి కోసం మీకు సమీపంలోని సంబంధిత నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?
girls | boys | latest-telugu-news