Winter Fog: డ్రైవింగ్ చేస్తుంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే డేంజర్

శీతాకాల పొగమంచు కారణంగా ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. తెల్లవారుజామున పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్‌గా మీ గమ్యాన్ని చేరుకుంటారు. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు కనిపించవు.

New Update
winter fog

అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎలాగైతే ఆపలేమో.. అలాగే మనం ఎంత ట్రై చేసినా వింటర్‌లో పొగమంచు(fogg-effect) ని అడ్డుకోలేము. కొంచెం అటూ ఇటూ అయితే.. రోడ్డు కనిపించకుండా అలుముకున్న పొగమంచులోంచే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పదుల సంఖ్యలో ప్రాణాలను పొట్టనబెట్టుకుంటూ, వందలాది మందిని గాయాలపాలు చేస్తోంది ఈ శీతాకాల పొగమంచు. ఈరోజు (డిసెంబర్ 16)న ఢిల్లీ-  ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై తెల్లవారుజామున 4 గంటలకు 10 బస్సులు, కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. 25 మందికి పైగా గాయాలైయ్యాయి. ఇదొక్కటే కాదు. శీతాకాలంలో ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. తెల్లవారుజామున పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్‌గా మీ గమ్యాన్ని చేరుకుంటారు. - foggy-condition-across-telangana

Also Read :  ‘చనిపోయినట్లు నటించి.. దెబ్బ తీస్తోన్న క్యాన్సర్ కణాలు’

శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు కనిపించకపోతే తప్పనిసరిగా ఇవి పాటించాలి:

బీమ్ లైట్లు: హెడ్‌లైట్లను ఎల్లప్పుడూ లో బీమ్‌లో మాత్రమే ఉపయోగించండి. పొగమంచులో హై బీమ్ ఉపయోగిస్తే కాంతి తిరిగి మీ కళ్లపై పడి, దారి సరిగా కనిపించదు.  
ఫాగ్ లైట్లు: మీ వాహనానికి ఫాగ్ లైట్లు ఉంటే, వాటిని తప్పకుండా ఆన్ చేయండి. ఇవి రోడ్డుపై నేరుగా లైటింగ్ పడేట్లు చేసి ఎదురుగా ఏం వస్తున్నా క్లియర్‌గా కనిపించేలా చేస్తోంది.
నో హజార్డ్ లైట్లు: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హజార్డ్ లైట్లు(పార్కింగ్ లైట్లు) ఉపయోగించవద్దు. ఆపినప్పుడు మాత్రమే వీటిని వాడాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు హజార్డ్ లైట్లు వేస్తే, వెనుక వచ్చే వారికి మీరు ఆగిపోయారేమోనని గందరగోళం ఏర్పడుతుంది.
విండ్‌షీల్డ్‌‌ని క్లియర్‌గా శుభ్రం చేయాలి:విండ్‌షీల్డ్‌పై ఏర్పడే మంచు లేదా తేమను తొలగించడానికి డిఫాగర్, వైపర్‌లను ఉపయోగించండి. అద్దాలను లోపల, బయట శుభ్రంగా ఉంచుకోండి.

Also Read :  మధుమేహ బాధితులకు శుభవార్త.. భారత్‌లోకి ఒజెంపిక్

డ్రైవింగ్ టిప్స్

రోడ్డుపై పొగమంచు ఉంటే నెమ్మదిగా వాహనాలు నడపాలి. పొగమంచు తగ్గే వరకు వేచి ఉండండి. మీ ముందున్న వాహనానికి, మీ వాహనానికి మధ్య సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ దూరం ఉంచండి. అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వస్తే ఇది మీకు తగిన సమయాన్ని ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించవద్దు. కారు విండోస్ కొద్దిగా తెరిచి, బయటి శబ్దాలపై దృష్టి పెట్టండి. ఇతర వాహనాల హారన్ శబ్దాలు మీకు ముందు ఉన్న ప్రమాదాన్ని లేదా వాహనాన్ని అంచనా వేయడానికి సహాయపడతాయి. అవసరమైనప్పుడు మాత్రమే హారన్ ఉపయోగించండి. నిరంతరం హారన్ సౌండ్ చేయవద్దు. 

Advertisment
తాజా కథనాలు