Gannavaram Airport : పొగమంచు ఎఫెక్ట్.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానాలు
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో.. హైదరాబాద్, చెన్నై గన్నవరం ఎయిర్పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ సేఫ్ ల్యాండింగ్ అవుతాయా తిరిగి వెళ్లిపోతాయా అనేదానిపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.