గుప్పెడు గింజలు డైలీ తింటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్

డైలీ గుప్పెడు అవిసె గింజలను తినడం వల్ల గుండె సమస్యలు రావు. అలాగే జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

New Update
Soaked Flax seeds Benefits: ఈ గింజలు నీటిలో నానబెట్టి పరగడపున తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Flax seeds

అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని డైలీ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఈ అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి:USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!

మలబద్ధకం సమస్య నుంచి విముక్తి..

బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్న వారు డైలీ గుప్పెడు అవిసె గింజలను తింటే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. అయితే అవిసె గింజలను పచ్చిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని కాస్త వేయించిన తర్వాతే తినాలి. అప్పుడే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయని నిపుణులు అంటున్నారు. 

అవిపె గింజల్లోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బాగా సహాయపడతాయి. అలాగే ఇవి చర్మ రంగును కూడా మారుస్తాయి. చర్మంపై ముడతలు రాకుండా మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తు్ంది. ఈ అవిసె గింజల వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి:TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!

Advertisment
తాజా కథనాలు