/rtv/media/media_files/2025/03/02/2a1IUgnFElLHEHKHE4eV.jpg)
SANDEEP REDDY VANG
Sandeep Reddy Vanga: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్ మేకింగ్ కంటే .. IAS ఆఫీసర్ కావడం ఈజీ.. అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సందీప్ గతంలో 'యానిమల్' ని ఉద్దేశించి ఓ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
IAS ఆఫీసర్ కావడం ఈజీ..
ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఓ ఇంటర్వ్యూలో యానిమల్ పై చేసిన వ్యాఖ్యలు నాకింకా గుర్తున్నాయి. యానిమల్ లాంటి సినిమాలు అసలు తెరకెక్కించకూడదని ఆయన అభిప్రాయం. ఈ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని అన్నారు. ఆ వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. ఆయన అనవరసరంగా నా సినిమా గురించి విమర్శలు చేశారు. ఆ సమయంలో చాలా కోపం వచ్చింది. అయితే అప్పుడు నేను ఒక్కటే అర్థం చేసుకున్నాను.. ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఢిల్లీకి వెళ్లి ఏదైనా సంస్థలో చేరి కష్టపడి చదివితే సరిపోతుంది. కానీ, అదే ఫిల్మ్ మేకర్, లేదా రచయిత కావాలంటే ఎలాంటి టీచర్లు, కోర్సులు ఉండవు. అది స్వయంగా నేర్చుకోవాలి అంటూ యానిమల్ విమర్శలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. అయితే గతంలో మాజీ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తిని సమాజానికి సందేశాత్మకమైన చిత్రాలు అవసరమని.. 'యానిమల్' తరహా చిత్రాలు అనవసరమైనవని అన్నట్లుగా విమర్శలు చేశారు. ఇప్పుడు వంగా ఈ విమర్శలను ఉద్దేశించే స్పందించినట్లు తెలుస్తోంది.
Also Read: TG High Court: ప్రీమియర్, బెనిఫిట్ షోలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. అనుమతించాలంటూ ఉత్తర్వులు!