/rtv/media/media_files/2025/09/11/biscuits-2025-09-11-20-37-54.jpg)
Biscuits
బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివని చాలా మంది ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలకు బిస్కెట్లు ఎక్కువగా పెడుతుంటారు. వంట ఆలస్యం అవుతుందంటే చాలు.. పాలు బిస్కెట్లు పెడతారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ శాతం మంది అనుకుంటారు. అయితే బిస్కెట్లలో ఎలాంటి పోషకాలు ఉండవని వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైలీ బిస్కెట్లు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మరి ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Diet Tips: డయాబెటిస్ ఉంటే ఆలు గడ్డ తినొచ్చా..? వైద్యుల సూచనలు తెలుసుకోండి..!!
మైదా ఎక్కువగా ఉండే వాటిని..
బిస్కెట్లలో శుద్ధి చేసిన పిండి, చక్కెరచ, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో అవసరమైన పోషకాలు ఉండటంతో పాటు ఫైబర్ ఉండదు. దీనివల్ల డైలీ బిస్కెట్లను తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డైలీ వీటిని తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే అధిక రక్తపోటు, మలబద్ధకం, పోషకాహార లోపం వంటి సమస్యలు వస్తాయి. అయితే బిస్కెట్లు తినే అలవాటు ఉంటే ఇంట్లోనే చేసుకోవడం ఉత్తమం. లేకపోతే మైదా వంటి పదార్థాలు లేని కంపెనీ బిస్కెట్లు తినడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ శాతం బిస్కెట్లలో శుద్ధి చేసిన గోధుమ పిండి అనగా మైదా ఉంటుంది. ఇందులో ఫైబర్, పోషకాలు తక్కువగా ఉంటాయి. వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే బిస్కెట్లను ఎక్కువగా పామాయిల్‌తో తయారు చేస్తారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) ను పెంచుతాయి. దీనివల్ల పోషక విలువలు తగ్గుతాయి. ఇందులో ఎలాంటి విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్, ఫైబర్ వంటివి ఉండవు. దీంతో కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
Why you should avoid biscuits??
— Ayur Arogyam (@aayurarogyam) July 21, 2021
- Loaded with sugar, fat and carbohydrates
-Non transparent & Cryptic ingredients like edible flour, oil
- Unknown fortified source which can be even animal source
- Contains Zero nutrients 1/n pic.twitter.com/HyktJbuW1m
ఇది కూడా చూడండి: Milkshake Side Effects: మిల్క్ షేక్‌తో మైండ్ షేక్ అయిపోతుంది జాగ్రత్త!!
ఈ బిస్కెట్లు తయారు చేసి తింటే?
బిస్కెట్లు తినే అలవాటు ఎక్కువగా ఉంటే తృణధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇందులోని ఫైబర్ ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైదా ఉండేవి అసలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.