వయస్సు పెరిగినా కూడా యవ్వనంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. దీనికోసం వ్యాయామం, జిమ్, ఆహార నియమాలు వంటివన్ని పాటిస్తుంటారు. అయితే ఎన్నేళ్లు అయినా కూడా యంగ్‌గా ఉండాలంటే మాత్రం ఆహారంలో తప్పకుండా కొన్ని రకాల పండ్లు యాడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో ఉంటారు. అయితే యంగ్ లుక్‌లో ఉండేందుకు తీసుకోవాల్సిన పండ్లు ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!
బెర్రీలు
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల స్కిన్ మెరుస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
అవోకాడో
అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. అలాగే ముఖంపై ట్యాన్‌ను తొలగించడంతో పాటు ముసలితనం రాకుండా చేస్తుంది.
ఆపిల్స్
వీటిలో ఫైబర్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి ఫిట్‌గా ఉండేలా చేయడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.
ఇది కూడా చూడండి: HYD NEWS: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల మనువడు దుర్మరణం
బొప్పాయి
బొప్పాయిలోని పపైన్ జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బొప్పాయిని తినడం లేదా ముఖానికి ప్యాక్ వేసుకున్న కూడా ఫలితం ఉంటుంది.
దానిమ్మ
వీటిలో పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కీళ్లు, గుండె, చర్మ ఆరోగ్యాన్ని మెరిపిస్తాయి. వీటిలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై ఉండే నలుపును తగ్గించి తెల్లగా చేస్తుంది.
ఇది కూడా చూడండి: Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!
అరటిపండ్లు
వీటిలోని పొటాషియం, మెగ్నీషియం చర్మంపై ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అరటిపండును ముఖానికి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది.
నారింజ
వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. డైలీ ఒక నారింజ తినడం వల్ల యంగ్ లుక్‌లో ఉంటారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు