You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు

చెత్త కంటెంట్ ను తొలగించేందుకు యట్యూబ్ స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తోంది. యూట్యూబ్ లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో చర్యలకు పూనుకుంది. కేవలం మూడు నెలల వ్యవధిలో దాదాపు 95లక్షల వీడియోలు, 45లక్షల ఛానెళ్లను తొలగించింది. ఇందులో ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. 

New Update
11

You Tube

యూట్యూబ్ లో ఉన్న హానికరమైన కంటెంట్ మరెక్కడా ఉండదు. ఫేక్ కంటెంట్, విద్వేషపూరిత వీడియోలు, వేధింపులు, హింస లాంటి  ఈ సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరికి ఏది నచ్చితే అది పెట్టేస్తుంటారు. యూట్యూబ్ మీద ఎప్పుడూ చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇన్నాళ్ళు వీటిని పెద్దగా పట్టించుకోలేదు యూట్యూబ్ యాజమాన్యం.   కానీ ఫిర్యాదులు ఎక్కువ అవుతుండడంతో ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ ను అమలు చేస్తోంది. హానికరమైన కంటెంట్ ను గుర్తించి తొలగిస్తోంది. కేవలం మూడు నెలల వ్యవధిలో దాదాపు 95లక్షల వీడియోలు, 45లక్షల ఛానెళ్లను తీసేసింది. ముఖ్యంగా భారత్లో అత్యధిక ఈ తొలగింపులు జరిగాయి. దాదాపు 30లక్షల వీడియోలను యూట్యూబ్ యాజమాన్యం తొలగించింది. 

ఇక మీద ఆటలు చెల్లవ్..

ఈ కంటెంట్ ను తొలగించడానికి యూట్యూబ్ ఏఐను వాడుతోంది. చెత్త వీడియోలను ఎక్కువ మంది చూడ్డానికి ముందే గుర్తించ తొలగించేలా ఏర్పాట్లు చేసింది. వీటిలో ప్రమాదకరమైన కంటెంట్, వేధింపులు,హింసాత్మక దృశ్యాలు, స్పామ్, తప్పుదారి పట్టించే కంటెంట్ వీడియోలు య్యూట్యూబ్ తొలగించిన జాబితాలో ఉన్నాయి. 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో దాదాపు 95 లక్షలు వీడియోలు యూట్యూబ్ నుంచి డిలీట్ చేసింది. పిల్లల భద్రతకు ముప్పు కలిగించే వీడియోలు కూడా ఇందులో ఉన్నాయి.  ఇలాంటివి సుమారు 50లక్షల వీడియోలను య్యూట్యూబ్ తొలగించింది. కేవలం వీడియోలు మాత్రమే కాకుండా.. యూట్యూబ్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి 45లక్షల  ఛానెళ్లను కూడా ఏరి పారేసింది. అక్కడితో ఆగలేదు. పలు వీడియోల కింద ఉన్న 1కోటి2లక్షల కామెంట్లను కూడా డిలీట్ చేసింది. దాంతో పాటూ యూట్యూబ్ ఛానెల్స్ ఉండాలంటే రూల్స్ ను స్ట్రిక్ట్ అములు చేయాలని హెచ్చరించింది యూట్యూబ్ యాజమాన్యం.
యూట్యూబ్ ప్లాట్ ఫామ్ భద్రతకు కంపెనీ కట్టుబడి ఉందని చెప్పింది. వీడియోలు అప్లోడ్ చేసే ముందే ఒకటికి రెండు సార్లు చెక్ చేుకోవాలని సూచించింది.

Also Read: USA: రష్యా పైనా ఆంక్షలు తప్పవంటున్న ట్రంప్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు