/rtv/media/media_files/TZbtUXJLFjDwBmjh1EyP.jpg)
Early Morning
కొందరికి ఉదయం పూట కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే వీటి విషయంలో జాగ్రత్త పడితే పర్లేదు. కానీ లైట్ తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని లక్షణాల వల్ల గుండె పోటు, మధుమేహం, అధిక ఒత్తిడి, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే ఉదయం పూట కనిపించే ఏయే లక్షణాలు ఈ సమస్యలకు కారణం అవుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Japanese Health Secret: జపాన్‌లో లక్ష మందికి 100 ఏళ్లకు పైగా ఆయుష్షు.. వాళ్ల హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా?
తీవ్రమైన తలనొప్పి
ఉదయం నిద్ర లేవగానే తీవ్రమైన తలనొప్పి వస్తుంటే మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి అధికంగా ఉంటే రక్తపోటు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఎక్కువగా వస్తుంటే మాత్రం అసలు లైట్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తలతిరగడం
తరచుగా కొందరికి తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఇది కేవలం ఒత్తిడి వల్ల మాత్రమే కాదు.. అధిక రక్తపోటు వల్ల కూడా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు మెదడుకు సరైన రక్త ప్రసరణ అందకపోవడం వల్ల తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఛాతి నొప్పి
ఉదయం నిద్ర లేవగానే ఛాతీలో నొప్పి లేదా భారంగా అనిపిస్తే అది ప్రమాదానికి సంకేతం కావచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారికి ఛాతీలో నొప్పి, బరువుగా అనిపించడం లేదా శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ముఖ్యం.
చూపు మసకబారడం
ఉదయం పూట చూపు మసకబారినట్లు అనిపిస్తుంటే, ఆ లక్షణాన్ని అస్సలు విస్మరించకూడదు. ఈ లక్షణం అధిక రక్తపోటును సూచించవచ్చు. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు కంటిలోని రక్తనాళాలు దెబ్బతిని, దృష్టికి సంబంధించిన సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా ఈ పరిస్థితి కొనసాగితే కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
అలసట, బలహీనత
ఉదయం నిద్ర లేవగానే అలసిపోయినట్లు బలహీనంగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు ఉన్న రోగులలో ఈ అలసట, బలహీనత చాలా సాధారణం. ఈ లక్షణాలను చిన్నవిగా భావించవద్దు. అధిక రక్తపోటు ఉన్నప్పుడు గుండె ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. దీనివల్ల శరీరానికి సరైన ఆక్సిజన్ అందక, అలసట, బలహీనత కలుగుతాయి.
తగ్గించడం ఎలా?
ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్తపోటును పరీక్షించుకోవాలి. అలాగే జీవనశైలిలో మార్పులు చేయాలి. ఉప్పు ఎక్కువగా తగ్గించాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతీ రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Skin Health: అరేబియన్ భామల అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా?