/rtv/media/media_files/2025/01/02/grRiAMp2oICATHmX0uII.jpg)
Weekly Horoscope
మేషం
మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో బంధువులతో శుభకార్యాల గురించి మాట్లాడతారు. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది. వారం చివరలో ఖర్చులు పెరుగుతాయి.
వృషభం
ఈ వారం మీరు పనులలో విజయాన్ని సాధిస్తారు. స్నేహితుల సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. పాత గొడవలను బంధువులతో సామరస్యంగా పరిష్కరించుకుంటారు. వాహనం కొనే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్న మాట పట్టింపులు రావచ్చు.
మిథునం
ముఖ్యమైన పనులు ఆలస్యమైనా సమయానికి పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. మొండి బాకీలు కొంతవరకు వసూలవుతాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారులతో ఉన్న విభేదాలు తొలగుతాయి. వారం చివరలో గొడవలకు దూరంగా ఉండాలి, డబ్బు సమస్యలు రావచ్చు.
కర్కాటకం
పనులు కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పిల్లల విద్యకు సంబంధించి మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు పని భారం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
సింహం
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత మిత్రులను కలుసుకుని శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఇంటి నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు చేస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. వారం మధ్య నుంచి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు.
కన్య
ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలపై కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగులు సఖ్యతగా ఉంటారు. వారం చివరలో ఖర్చులు, ప్రయాణాలు పెరుగుతాయి.
తుల
ప్రయాణాల్లో కొత్త పరిచయాలు లాభాన్నిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. భూమి కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగుతాయి.
వృశ్చికం
సంతానం, విద్యకు మంచి అవకాశాలు. కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నవారితో పరిచయాలు లాభిస్తాయి. వారం చివరలో అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
ధనుస్సు
కొత్త పనులు మొదలుపెడతారు. డబ్బు సమస్యలు తీరుతాయి. శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలన్నీ విజయవంతంగా సాగుతాయి. వారం చివరలో జీవిత భాగస్వామితో చిన్న గొడవలు రావచ్చు.
మకరం
ఆదాయ మార్గాలు తగ్గుతాయి. అప్పు చేయవలసి రావచ్చు. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. విలువైన పత్రాల విషయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. వారం చివరలో డబ్బు లాభాలు, కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభం
ఉద్యోగాలలో ఉత్సాహంగా పనిచేసి లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో కొత్త కార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి మిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ పెట్టాలి. పరిహారం: శివారాధన.
మీనం
ధన వ్యవహారాలు సంతృప్తిని ఇస్తాయి. ముఖ్యమైన విషయాలలో మీరు వేసిన అంచనాలు నిజమవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వారం మొదట్లో స్వల్ప అనారోగ్య సమస్యలు రావచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.