/rtv/media/media_files/2024/12/19/gJHifZjLGXwFAkx7WYyw.jpg)
Walnuts
ప్రస్తుత ఆహార అలవాట్ల వల్ల చాలా మంది థైరాయిడ్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వస్తే తగ్గడం అంత ఈజీ కాదు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఒక్కసారిగా బరువు పెరిగిపోతారు. లేదంటే పూర్తిగా బరువు తగ్గిపోతారు. అయితే ఈ థైరాయిడ్ సమస్య నుంచి బయటపడాలంటే ఉదయం తప్పకుండా ఈ ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
పొద్దు తిరుగుడు గింజలు
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం, విటమిన్ ఇ, జింక్ వంటివి థైరాయిడ్‌ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఉదయం పూట వీటిని తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు థైరాయిడ్ సమస్య కూడా తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
వాల్‌నట్స్
ఇందులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరును మారుస్తుంది.
ఇది కూడా చూడండి: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
ఆకుకూరలు
తాజా ఆకు కూరలను ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా పాలకూర, మెంతులు, ఆవాలు, బతువా వంటి వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలాంటి అలసట రాకుండా కాపాడతాయి. వీటిని డైలీ తినడం వల్ల కేవలం థైరాయిడ్ మాత్రమే కాకుండా వివిధ రకాల వ్యాధులు కూడా రావు.
ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
బెర్రీలు
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి వాటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో పాటు ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి కూడా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.