/rtv/media/media_files/2025/10/15/drinking-water-2025-10-15-08-10-06.jpg)
Drinking Water
నీరు అనేవి ప్రతీ జీవికి అవసరమే. కొందరు దాహమేస్తే తాగితే.. మరికొందరు దాహం వేయకపోతే తాగుతారు. అయితే ఎక్కువ శాతం మంది భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతారు. రోజంతా మళ్లీ తాగరు. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. భోజనం చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కూడా నీరు తాగుతుంటారు. తక్కువగా తాగితే పర్లేదు. కానీ అధికంగా నీరు తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
పెద్ద మొత్తంలో నీళ్లు తాగితే..
భోజనం చేసిన వెంటనే పెద్ద మొత్తంలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల జీర్ణక్రియలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ ఎంజైమ్‌లు పలుచన అవుతాయి. దీంతో ఆహారం జీర్ణం చేయడానికి జీర్ణ రసాలు, ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. అదే తక్కువగా వాటర్ తాగితే ఈ సమస్య ఉండదు. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోతే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీనివల్ల చిరాకు ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే గుండెల్లో మంట ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల ప్రోటీన్ జీవక్రియ ప్రభావితం అవుతుంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. భోజనానికి ఒక అరగంట ముందు వాటర్ తాగాలి. లేదా భోజనం చేసిన 30 లేదా 45 నిమిషాల తర్వాత వాటర్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల తిన్న ఫుడ్ కూడా సరిగ్గా జీర్ణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి జీర్ణ సమస్యలు రావని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Health Tips: పార్కిన్సన్ వ్యాధి నాడి పట్టేసిన శాస్త్రవేత్తలు.. ఎలానో మీరూ తెలుసుకోండి!!
కొందరు పూర్తిగా వాటర్ తాగకుండా ఉంటారు. బాడీకి సరిపడా వాటర్ తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని చెబుతున్నారు. వాటర్ సరిగ్గా తాగకపోతే తినే ఫుడ్ జీర్ణం కాదు. దీనివల్ల మలబద్ధకం, కడుపు నొప్పి, అల్సర్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటర్ రోజుకు నాలుగు లీటర్లు తీసుకోవాలి. దీనివల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Organ Donation: బ్రెయిన్ డెడ్ వ్యక్తిలోని ఏ శరీర భాగాలు దానం చేయొచ్చో తెలుసుకోండి!!