Light Beer vs Strong Beer : లైట్ బీరు మంచిదా..స్ట్రాంగ్ బీరు మంచిదా?

దేశంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక యూత్ ఎక్కువగా బీర్లు తాగుతూ ఉంటారు.  బీరులో 4% నుండి 6% ఆల్కహాల్ ఉంటుంది. మితంగా బీర్ తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
lite-vs-strong

దేశంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక యూత్ ఎక్కువగా బీర్లు తాగుతూ ఉంటారు.  బీరులో 4% నుండి 6% ఆల్కహాల్ ఉంటుంది. మితంగా బీర్ తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో లైట్ బీరు మంచిదా స్ట్రాంగ్ బీరు మంచిదా అనే అనుమనాలు చాలా మందిలో ఉంటాయి.  లైట్ బీర్, స్ట్రాంగ్ బీర్ రెండింటికీ వాటి వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఏది మంచిదనేది మీ వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. 

లైట్ బీర్లో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉంటుంది, సాధారణంగా 4-5% ABV వరకు ఉంటుంది. స్ట్రాంగ్ బీర్ లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది, సాధారణంగా 5% ABV లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కొన్ని రకాల స్ట్రాంగ్ బీర్లలో ఇది 8% కంటే కూడా ఎక్కువగా ఉండొచ్చు. లైట్ బీర్ లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.  లైట్ బీర్ రుచిలో తేలికగా, తక్కువ చేదుగా ఉంటుంది.  స్ట్రాంగ్ బీర్ రుచిలో కొంచెం గాఢంగా, చేదుగా ఉంటుంది. ఇందులో ఫ్లేవర్లు ఎక్కువగా ఉంటాయి. 

మితంగా తాగితే కొన్ని ప్రయోజనాలు

ఏ బీరు అయినా మితంగా తాగితే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, ఎముకలను దృఢంగా ఉంచడం వంటివి.ఈ ప్రయోజనాలు ఎక్కువగా మితంగా (ఒకటి లేదా రెండు గ్లాసులు) తాగినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. అధికంగా తాగితే, కాలేయ సమస్యలు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.

మీరు తక్కువ కేలరీలు, తక్కువ ఆల్కహాల్ కావాలనుకుంటే తేలికపాటి రుచిని ఇష్టపడితే లైట్ బీర్ మంచిది. మీరు రుచికి ప్రాధాన్యత ఇస్తూ, ఎక్కువ ఆల్కహాల్ ఉండే బీర్లను అప్పుడప్పుడు తాగాలనుకుంటే స్ట్రాంగ్ బీర్ ఎంచుకోవచ్చు.

Also read :  Beer & whiskey : మందులో బీరు కలిపి కొడుతున్నారా... జరిగేది ఇదే!

Advertisment
తాజా కథనాలు