Beer & whiskey : మందులో బీరు కలిపి కొడుతున్నారా... జరిగేది ఇదే!

సాధారణంగా అయితే మందులో (వైన్, విస్కీ, వోడ్కా వంటి స్పిరిట్స్) నీళ్లు లేదా సోడా కలుపుకునా తాగుతుంటారు.  కానీ మందులో బీరు కలుపుకుని తాగితే ఎలా ఉంటుందనే సందేహం చాలామందికి వస్తుంది. అలా తాగవచ్చా.. తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
beer

మద్యం ప్రియులు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. సాధారణంగా అయితే మందులో (వైన్, విస్కీ, వోడ్కా వంటి స్పిరిట్స్) నీళ్లు లేదా సోడా కలుపుకునా తాగుతుంటారు.  కానీ మందులో బీరు కలుపుకుని తాగితే ఎలా ఉంటుందనే సందేహం చాలామందికి వస్తుంది. అలా తాగవచ్చా.. తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వైద్య నిపుణుల ప్రకారం మందులో బీరు కలిపి తాగడం మంచిది కాదు. దీనివల్ల కొన్ని సమస్యలు రావచ్చు. బీరు, మందు రెండింటిలోనూ ఆల్కహాల్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తాగడం వల్ల శరీరంలో ఆల్కహాల్ శాతం చాలా వేగంగా పెరిగిపోయి, తీవ్రమైన మత్తుకు దారితీస్తుంది. ఆల్కహాల్ కడుపు లోపలి పొరను ప్రభావితం చేస్తుంది, దీనివల్ల ఆమ్లత్వం, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయి.

బీరు, మందు కలిపి తీసుకోవడం వల్ల

ఇది శారీరక సమన్వయం కోల్పోవడం, తికమక, వాంతులు వంటి సమస్యలకు దారితీయవచ్చు.ఆల్కహాల్ మూత్రవిసర్జనను పెంచుతుంది. బీరు, మందు కలిపి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. బీరు, మందు కలిపి తాగడం వల్ల మొత్తం ఆల్కహాల్ వినియోగం పెరిగి, కాలేయంపై మరింత ఒత్తిడి పడి, ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.ఈ కాంబినేషన్ వల్ల మరుసటి రోజు వచ్చే హ్యాంగోవర్ చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఆరోగ్యం,రుచి రెండింటి దృష్ట్యా, మందులో బీరు కలపకుండా విడివిడిగా తాగడమే మంచిది.  

ఆల్కహాల్ ఏ రూపంలోనైనా సరే, మితంగా తీసుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయి, కానీ అతిగా తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. వివిధ రకాల ఆల్కహాల్ పానీయాలను కలిపి తాగడం వల్ల కలిగే నష్టాలు వాటిలోని ఆల్కహాల్ శాత, శరీరంలో అవి జీర్ణం అయ్యే విధానంపై ఆధారపడి ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పురుషులు వారానికి 14-21 యూనిట్ల ఆల్కహాల్ కంటే తక్కువగా, మహిళలు దీనికంటే తక్కువగా తీసుకోవడం సురక్షితం. ఒక బీరు క్యాన్‌లో సుమారు 3 యూనిట్ల ఆల్కహాల్ ఉండవచ్చు.

Advertisment
తాజా కథనాలు