Home Tpis: మటన్ త్వరగా ఉడకాలంటే ఈ ట్రిక్ ఫాలో అవండి

వెనిగర్, నిమ్మరసం వంటగదిలో ప్రధానమైనది. ఇవి మటన్ వేగంగా ఉడికించడానికి సహాయపడతాయి. వీటిలోని ఆమ్లత్వం మటన్‌ను మృదువుగా ఉడికించడానికి సహాయపడటమే కాకుండా వంటకానికి గొప్ప రుచిని ఇస్తుంది. నాన్-వెజ్ వంటకాల్లో టమోటా ముందుగా వేస్తే మటన్ త్వరగా ఉడుకుతుంది.

New Update
mutton-curry

mutton-curry

Home Tpis: కొన్నిసార్లు మటన్ వండేటప్పుడు ముక్కలు సరిగ్గా ఉడకవు. దీంతో ఏం చేయాలో తెలియక చాలా మంది వేడి నీళ్లు పోసి మళ్ళీ వేడి చేస్తారు. ఇలా చేయడం వల్ల సమయం వృధా కావడమే కాకుండా రుచి కూడా మారుతుంది. మటన్ వండడానికి ముందు వడకట్టిన టీ డికాషన్‌ను మాంసం మీద పోయాలి. అరగంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత ఉడికించినట్లయితే మటన్ త్వరగా ఉడుకుతుంది. టీలోని టానిన్లు మటన్ త్వరగా, మృదువుగా ఉడికించడానికి సహాయపడతాయి. వెనిగర్ లేదా నిమ్మరసం ప్రతి వంటగదిలో ప్రధానమైనది. ఇవి మటన్ వేగంగా ఉడికించడానికి సహాయపడతాయి. వీటిలోని ఆమ్లత్వం మటన్‌ను మృదువుగా ఉడికించడానికి సహాయపడటమే కాకుండా వంటకానికి గొప్ప రుచిని కూడా ఇస్తుంది. బొప్పాయి ఆకులు లేదా పచ్చి బొప్పాయిని కూడా మటన్‌ను త్వరగా, మృదువుగా వండడానికి ఉపయోగించవచ్చు. 

Also Read :  NIA అదుపులో తహవ్వుర్ రాణా.. ఫొటో విడుదల

నాన్-వెజ్ వంటకాల్లో ..

దీనిలోని పపైన్ అనే పదార్థం మాంసం వేగంగా ఉడకడానికి సహాయపడుతుంది. దీనివల్ల మటన్ ముక్కలు మెత్తగా అవుతాయి. టమోటాలు ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని చిన్న ముక్కలుగా కోయడం లేదా సాస్ రూపంలో జోడించడం వల్ల మటన్ వేగంగా ఉడకడానికి సహాయపడుతుంది. చాలా మంది అప్పుడు నాన్-వెజ్ వంటకాల్లో టమోటా ముక్కలను కలుపుతారు. ముందుగా వేస్తే మటన్ త్వరగా ఉడుకుతుంది. వంట చాలా రుచికరంగా ఉంటుంది. చాలా మంది మటన్ కర్రీలో రెగ్యులర్ ఉప్పు కలుపుతారు. బదులుగా రాతి ఉప్పుతో ఉడకబెట్టడానికి ప్రయత్నించండి. ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి నీళ్లన్నీ వడకట్టాలి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీ వర్షం.. ఈదరు గాలులతో హైదరాబాద్‌ అతలాకుతలం

ఆ తరువాత మాంసానికి కొంచెం రాతి ఉప్పు డి వేసి బాగా కలపండి. మటన్‌ని ఒక గంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత ఉడికించినట్లయితే అది త్వరగా ఉడుకుతుంది. ఎందుకంటే మాంసం ఉప్పును బాగా పీల్చుకుని మృదువుగా మారుతుంది. వంట చేయడానికి ముందు మటన్‌ను పెరుగులో గంటసేపు నానబెట్టండి. ఆ తర్వాత మాంసం ఉడికిస్తే అది త్వరగా ఉడుకుతుంది. పెరుగుకు బదులుగా మజ్జిగ కూడా వాడవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరానికి కాల్షియం కూడా లభిస్తుంది. అల్లంలో ఉండే కొన్ని ఎంజైమ్‌లు మటన్‌ను త్వరగా, మృదువుగా ఉడికించడంలో సహాయపడతాయి. మనం సాధారణంగా మటన్ వండేటప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను మసాలా కోసం ఉపయోగిస్తాము. వేయించడానికి ముందు తురిమిన అల్లం వేసి ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మటన్ త్వరగా ఉడికిపోతుంది.

Also Read :  ఫోన్‌ పేలో లంచం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన CI

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: షుగర్‌ ఉన్నవారికి అరటి పువ్వుతో కలిగే ప్రయోజనాలు

( mutton | chicken-mutton-shops | mutton-biryani | mutton-bone-recipes latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు