Mutton Biryani: అబిడ్స్ లో మటన్ ముక్క కోసం తన్నులాట.. కొట్టుకున్న కస్టమర్లు, వెయిటర్లు.. రాజాసింగ్ వార్నింగ్.!
హైదరాబాద్ అబిడ్స్ లోని ఓ హోటల్ లో పెద్ద ఘర్షణ జరిగింది. మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని ..తాము డబ్బులు పూర్తిగా చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో తేల్చి చెప్పారు వినియోగదారులు. దీంతో, ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు.