ప్రతి ఒక్కరి ఇంట్లో చీపురు అనేది తప్పకుండా ఉంటుంది. ఇంటిని శుభ్రం చేయడానికి అందరూ దీన్ని ఉపయోగిస్తారు. అయితే చీపురును వారంలో ఏ రోజు కొనాలి? ఇంటిలో ఏ మూల ఉంచాలనే విషయం కొందరికి పెద్దగా తెలయదు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చీపురుని అదృష్టంగా, లక్ష్మీదేవిగా భావిస్తారు. చీపురును ఇంటికి తెచ్చిన రోజు కూడా పూజించి వాడుతారు. ఎక్కువ రోజులు చీపురును వాడటం వల్ల పేదరికం వస్తుందని కొందరు ఎప్పటికప్పుడు మారుస్తుంటారు.
ఇది కూడా చూడండి:AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి
ఈ వారాల్లో మాత్రమే..
కొత్త చీపురును ఇంటికి మంగళవారం, శుక్రవారం రోజున తీసుకురావాలని పండితులు చెబుతున్నారు. తీసుకొచ్చిన చీపురును గురువారం లేదా శుక్రవారం మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయని పండితులు చెబుతున్నారు. కొందరు చీపురును నిలపెడుతుంటారు. ఇలా కాకుండా చీపురును ఎప్పుడూ కూడా పడుకుని పెట్టాలి. అప్పుడే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉంటారు.
ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్!
కొత్త చీపురును కేవలం కృష్ణ పక్షంలో మాత్రమే కొనుగోలు చేయాలి. శుక్ల పక్షంలో అయితే అసలు కొనుగోలు చేయకూడదని అంటున్నారు. శుక్లపక్షంలో చేస్తే అప్పుల సమస్యలు అధికం అవుతాయి. అలాగే చీపురును ఇంట్లో దక్షిణం లేదా నైరుతి దిశలో మాత్రమే పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఈశాన్య దిశలో చీపురును ఉంచకూడదు. అలాగే వంటగది, బెడ్‌రూమ్‌లో పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది.
ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. వివరాల కోసం పండితులను సంప్రదించండి.
ఇది కూడా చూడండి: TS: గ్రామ సభల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ