Running: రన్నింగ్ చేసే ముందు ఈ 10 ఫుడ్స్ తీసుకుంటున్నారా.. ఇక మీరు డేంజర్‌ జోన్‌లో పడినట్లే!

రన్నింగ్ చేసే ముందు వేయించిన ఆహారాలు, చిక్కుళ్లు, వేయించిన పదార్థాలు, పాల ఉత్పత్తులు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Running fast

Running

ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. కొందరు ఉదయం, మరికొందరు సాయంత్రం రన్నింగ్ చేస్తారు. అయితే రన్నింగ్ చేసే ముందు కొందరికి తెలియక కొన్ని పదార్థాలను తీసుకుంటారు. వీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రన్నింగ్ చేసే ముందు తినకూడదని 10 రకాల ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

పాల ఉత్పత్తులు

రన్నింగ్ ముందు పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటిలో లాక్టోస్ ఉంటుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే పదే పదే టాయిలెట్‌కు కూడా వెళ్లాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులు సోయా మిల్క్, బాదం పాలు కూడా తీసుకోవచ్చని అంటున్నారు.

ఇది కూడా చూడండి: Eggs : గుండె జబ్బులున్నాయా.. గుడ్డు బంజేయండి!  తస్మాత్ జాగ్రత్త!

వేయించిన ఆహారాలు

వేయించిన ఆహారాల్లో ఎక్కువగా కొవ్వు ఉంటుంది. వీటిని జీర్ణం చేసుకోవడానికి కాస్త సమయం ఎక్కువగా పడుతుంది. దీనివల్ల రన్నింగ్‌కు ముందు కడుపు నిండినట్లు, కాళ్లు బరువుగా అనిపిస్తుంది. 

చిక్కుళ్ల జాతి ఆహారాలు

బీన్స్, శనగలు వంటి చిక్కుళ్ల జాతి ఆహారాలలో ఎక్కువ ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల రన్నింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. వీటికి బదులు తేలికగా జీర్ణమయ్యే బనానా లేదా తేనెతో కూడిన టోస్ట్ తీసుకోవడం వల్ల త్వరగా శక్తి లభిస్తుందని చెబుతున్నారు.

అధిక పీచు పదార్థాలు ఉన్న కూరగాయలు

బ్రకోలి, క్యాబేజీ, కాలే వంటి ఎక్కువ పీచు ఉన్న కూరగాయలు రన్నింగ్‌కు ముందు తినడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

తృణధాన్యాలు

ఓట్స్, ఇతర అధిక ఫైబర్ ఉండే తృణధాన్యాలు రన్నింగ్‌కు ముందు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.

స్పైసీ ఫుడ్స్

మసాలా, కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు గుండెల్లో మంట వస్తుంది. దీనివల్ల రన్నింగ్ సమయంలో తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది.

అధిక కొవ్వు ఉన్న ఆహారాలు

అధిక కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి జీర్ణం కావడానికి కాస్త సమయం పడుతుంది. ఇవి పరుగెత్తేటప్పుడు కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వీటికి బదులు బనానా లేదా ప్రోటీన్ షేక్ వంటి తేలికపాటి స్నాక్స్ తీసుకోవాలి.

సోడా లేదా కార్బోనేటెడ్ డ్రింక్స్

కొంతమంది శక్తి కోసం సోడా తాగుతుంటారు. కానీ ఇవి కడుపులో ఉబ్బరం, ఇబ్బందికరమైన తేన్పులను కలిగిస్తాయి. కార్బోనేటెడ్ పానీయాల వల్ల కడుపులో గ్యాస్ పెరుగుతుంది.

సోడాతో కూడిన క్యాండీలు

ఈ క్యాండీలలో ఉండే చక్కెర వేగంగా శరీరంలోకి వెళ్లి శక్తిని పెంచుతుంది. అయితే ఈ శక్తి తక్కువ సమయంలోనే తగ్గిపోతుంది. దీని వల్ల పరుగు మధ్యలో అలసట, నీరసం వస్తాయి.

అసలేమీ తినకుండా ఉండడం

పూర్తిగా ఖాళీ కడుపుతో పరుగెత్తడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోయి తలతిరుగుడు, నీరసం వచ్చే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో పరుగెత్తడం వల్ల శరీరానికి శక్తి అందక వేగంగా అలసిపోతారని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Fasting: ఉపవాసం ఆరోగ్యానికి హానికరమా..? వెలుగులోకి షాకింగ్ నిజాలు

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు