Warm Water: చలికాలంలో సరైన స్నానం.. ఈ మార్గంలో చేస్తే చర్మం మృదువుగా..

చలిలో స్నానం చేయడం చాలా కష్టమైన పని. నిరంతరం వేడి నీటి స్నానం చేయటం శరీరానికి మంచిది కాదు. వేడి నీటితో జుట్టు కడగడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచి మెదడు, గుండె రెండింటికీ హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు.

New Update
Coldwaterbath6

Bath

Health Tips : చలికాలంలో ఉదయం లేవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆఫీస్‌లకు, ఇతర అవసరాలకు లేవాలన్న  బద్దకంగా, ఇబ్బందిగా ఉంటుంది. అదే స్నానం విషయంలో  చెప్పనక్కర్లేదు. ఎందుకంటే కొందరు ఉదయం ఉద్యోగాలు వేళ్లే వాళ్లు త్వరగా స్నానం చేయాలి. చలిలో స్నానం చేయడం చాలా కష్టమైన పని. ఇలాంటి సమయంలో చాలా మంది చలిని తరిమికొట్టేందుకు వేడినీటిని వాడుతూ ఉంటారు. అయితే వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరానికి తీవ్ర నష్టం ఉంటుందని చాలామందికి తెలియదు. చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం గురించి వైద్యులు ఏమంటున్నారో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

శరీరంలో రక్తప్రసరణ పెరిగి..

ఇది కూడా చదవండి:  మీ పిల్లలు పొడవు పెరగాలంటే ఈ ఆహారం ఇవ్వండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిరంతరం వేడి నీటి స్నానం శరీరానికి మంచిది కాదు. ఇది చర్మపు ఫోలికల్స్ దెబ్బతింటుంది. అంతేకాదు చాలా వేడి నీటిని తలపై పోయడం వల్ల వెంట్రుకలు బలహీనపడి రాలడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో చర్మం సహజ చర్మ నూనెలు క్షీణించబడతాయి. దీని వలన చర్మం పొడిగా, సున్నితంగా మారుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి జలుబు, దగ్గు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇది నిద్రలేమి సమస్యను కూడా నయం చేస్తుందని అంటున్నారు.

Also Read :  10 ఏళ్ళుగా ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా ఎంపిక.. ఏ దేశమో తెలుసా..?

చాలా వేడి నీటితో జుట్టు కడగడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది మెదడు, గుండె రెండింటికీ హాని చేస్తుంది. అందుకని చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అధిక వేడి నీటిని వాడకుండా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చర్మంతోపాటు జుట్టును రక్షించడమే కాకుండా చలికాలంలో శరీరాన్ని తాజాగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పిల్లలకు ఈ వయసు వచ్చే వరకు షుగర్‌ పెట్టొద్దు

Also Read: తొక్కే కదా అని తీసి పడేస్తున్నారా.. లాభాలు తెలిస్తే వదలరు

Advertisment