10 ఏళ్ళుగా ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా ఎంపిక.. ఏ దేశమో తెలుసా..?

ప్రపంచ అత్యత్తమ నగరాల వార్షిక ర్యాంకింగ్‌లో లండన్ ఉత్తమ నగరంగా ఎంపికైంది. గత 10 ఏళ్లుగా న్యూయార్క్, పారిస్, టోక్యోలను వంటి దేశాలను వెనక్కి నెట్టి లండన్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంది.

New Update
london (1)

london

Top City:  రియల్ ఎస్టేట్, టూరిజం మరియు ఎకనామిక్ డెవలప్‌మెంట్‌లో గ్లోబల్ అడ్వైజర్ అయిన రెసోనాన్స్  సంస్థ  ప్రపంచ అత్యుత్తమ నగరాల వార్షిక ర్యాంకింగ్‌ జాబితాను విడుదల చేసింది. ఇందులో 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ  ప్రపంచ అత్యుత్తమ నగరాల వార్షిక ర్యాంకింగ్‌లో లండన్‌  సంవత్సరం ఉత్తమ నగరంగా ఎంపికైంది. గత 10 సంవత్సరాలుగా వరుసగా ఆధిపత్యం చెలాయిస్తుంది. ప్రతి ఏడాది లండన్ ప్రపంచ ఆకర్షణను ప్రతిబింబిస్తుంది. లండన్ నగరాన్ని సాంస్కృతిక వారసత్వం, బలమైన వ్యాపార మౌలిక సదుపాయాలకు చిహ్నం. 

ఇది కూడా చదవండి:  శాఖాహారులు అత్తి పండ్ల తింటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి

లండన్ బెస్ట్ సిటీ 

అయితే ఈ సంవత్సరం ఉత్తమ సిటీ ర్యాంకింగ్‌ పరిశీలనలో ప్రజల అవగాహనను కూడా చేర్చారు. మొదటిసారి 30 దేశాల నుంచి 22,000 మందికి పైగా వ్యక్తుల అభిప్రాయాలు తీసుకొని విశ్లేషించారు.  ఇందులో లండన్ అగ్రస్థానం కైవసం చేసుకోగా న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్ (ఇటలీ), మాడ్రిడ్ (స్పెయిన్), బార్సిలోనా (స్పెయిన్), బెర్లిన్ (జర్మనీ) , సిడ్నీ (ఆస్ట్రేలియా) నగరాలు టాప్ 10 ఉత్తమ నగరాలుగా నిలిచాయి. 

ఉత్తమ సిటీగా లండన్ ఎందుకు..? 

లండన్లోని పర్యావరణ నాణ్యత, సాంస్కృతిక చైతన్యం, డైనింగ్, నైట్ లైఫ్, షాపింగ్ , బిజినెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అనేక ఇతర అంశాల్లో ప్రజలు అన్వేషించడానికి ఉత్తమంగా పరిగణించబడింది. అంతేకాదు లండన్ లోని ప్రాంతీయ విమానాశ్రయం కనెక్టివిటీ, యూనివర్సిటీల నాణ్యతను కూడా అంచనా వేశారు. ఈ అంశాలన్నీ పరీశీలించిన తర్వాత లండన్ బెస్ట్ సిటీగా ఎంపికైంది. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

ఇది కూడా చదవండి: ప్రారంభమైన శీతాకాలం సమావేశాలు..చర్చకు 17 బిల్లులు

ఇది కూడా చదవండి:పిల్లలకు ఈ వయసు వచ్చే వరకు షుగర్‌ పెట్టొద్దు

Advertisment
తాజా కథనాలు