/rtv/media/media_files/2024/11/21/babybath91.jpeg)
సాధారణంగా చిన్న పిల్లలు, నవజాత శిశువులు తరచూ ఏడవడం చేస్తుంటారు. చిరాకు లేదా కడుపులో ఏదైనా నొప్పి, సమస్య కారణంగా వీళ్ళు ఏడవడం జరుగుతుంటుంది. కొంతమంది పిల్లలు ఎంత ఓదార్చిన ఏడుపు ఆపకుండా గుక్కపెట్టి ఏడుస్తుంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచక కంగారు పడిపోతుంటారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా వైద్య నిపుణులు ఒక ప్రత్యేకమైన టెక్నీక్ కనిపెట్టారు. అదే 'ఐ లవ్ యు' మసాజ్(I Love You Massage)! I LOVE YOU మసాజ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : ఖాళీ కడుపుతో ఈ 8 పదార్థాలు తీసుకుంటున్నారా.. ఇక డేంజర్‌లోనే మీ ప్రాణాలు!
'ఐ లవ్ యు' మసాజ్ అంటే ఏమిటి?
'ఐ లవ్ యు' అంటే శిశువు బొడ్డుపై చేసే ఒక సున్నితమైన మర్దన. దీనిని "I", "L", "U" అనే అక్షరాల ఆకృతిలో చేస్తారు. అందుకే 'ఐ లవ్ యు' మసాజ్ అంటారు. ఇది శిశువులలో జీర్ణక్రియను మెరుగుపరచి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీనివల్ల కడుపునొప్పి, ఏడుపు త్వరగా తగ్గుతాయి.
మసాజ్ ఎలా చేయాలి?
మొదటి అక్షరం 'I'.. శిశువు కడుపుపై బొడ్డు కింద, ఎడమ వైపు నుంచి పైకి, నిలువుగా "I" ఆకారంలో మసాజ్ చేయాలి. ఇది పేగుల కదలికలకు సహాయపడుతుంది.
రెండో అక్షరం 'L'.. ఎడమ పక్క నుంచి కుడి పక్కకు, ఆ తర్వాత కిందకు "L" ఆకారంలో మసాజ్ చేయాలి.
మూడో అక్షరం 'U'.. కుడి పక్క నుంచి పైకి, ఆ తర్వాత బొడ్డుకు ఎగువగా అడ్డంగా, ఆపై కిందకు ఎడమ పక్కకు "U" ఆకారంలో మదర్దన చేయాలి. ఈ కదలికలు శిశువు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/20/baby-2025-08-20-19-58-53.png)
Also Read : డేంజర్..! ఈ మూడు టిఫిన్లతో గుండెపోటు ముప్పు
మసాజ్ వల్ల లాభాలు
గ్యాస్, మలబద్ధకం
ఈ మసాజ్ పేగుల కదలికలను ప్రోత్సహించడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఆహారం సులువుగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
కడుపునొప్పి
ఈ ఆకారంలో మసాజ్ చేసినప్పుడు .. శిశువు కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందుతాడు. ఆపై ప్రశాంతంగా నిద్రపోతాడు.
అలాగే మసాజ్ చేయడం పేరెంట్స్ , శిశువు మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. అయితే పిల్లలకు మసాజ్ చేసేటప్పుడు సున్నితమైన నూనెలను మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఇది చేసిన తర్వాత కూడా శిశువు ఏడుపు ఆపకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.