/rtv/media/media_files/2025/02/07/734BVjEyd5JRf4VGs62e.jpg)
Heart Attack
Healthy Breakfast: ఈ మధ్య గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. జిమ్ చేస్తూ, డాన్స్ చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ ఉన్నచోటే అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. నేటి జీవశైలి, ఆహారపు అలవాట్లే గుండెపోటు ప్రమాదానికి ప్రధాన కారణాలని అంటున్నారు నిపుణులు. ఇష్టానుసారంగా నూనె పదార్థాలను, జంక్ ఫుడ్ తీసుకోవడం మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కావున మన డైలీ డైట్ ని ఎంతో ఆరోగ్యకరంగా ప్లాన్ చేసుకోవాలి.
అయితే మనం రోజూ తీసుకునే అల్పాహారంలో కొన్నింటిని తినడం వల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన భోజనంలో బ్రేక్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది మన మొత్తం రోజును, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కావున బ్రేక్ ఫాస్ట్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
గుండె జబ్బులను పెంచే అల్పాహారాలు
పూరి
ఇండియన్ మెనూలో పూరి అనేది అందరికీ చాలా ఇష్టమైన, అలాగే ఎక్కువగా ఎంపిక చేసుకునే బ్రేక్ ఫాస్ట్. ముఖ్యంగా చాలా మంది తల్లులు సింపుల్ గా అయిపోతుందని తమ పిల్లలకు పూరిని బ్రేక్ ఫాస్ట్ గా ఇస్తారు. కానీ, ఇది చాలా పెద్ద తప్పు! వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. ఇది గుండెజబ్బులు లేదా గుండెపోటు ప్రమాదాన్ని కలిగించవచ్చు.
మసాలా దోశ
మసాలా దోష కూడా చాలా ఫేమస్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. సాధారణంగా దోస ఆరోగ్యానికి మంచిదే. కానీ దానిలో బంగాళాదుంపలు, చీజ్ లేదా వెన్న వంటి యాడెడ్ ఇంగ్రీడియంట్స్ కారణంగా దోసలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఉదయాన్ని ఇంత హెవీ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
టీ, బిస్కెట్లు
భారతదేశంలో చాలా మంది తమ డేను ఒక కప్పు టీ, బిస్కెట్లతో ప్రారంభిస్తారు. ఇది కేవలం ఒక కప్పు టీ, బిస్కెట్ మాత్రమే కాదు!.. దీనిని రోజూ తీసుకోవడం వల్ల మిమల్ని అనేక వ్యాధులకు గురిచేస్తుంది. వీటిలోని అధిక షుగర్ కంటెంట్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు వైద్యులు. రక్తంలో చక్కర స్థాయిలు పెరగడం గుండెపోటు ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది.
బ్రెడ్, జామ్
ఆధునిక కాలంలో బ్రెడ్ జామ్ అందరికీ చాలా ఈజీ ఎంపిక. కానీ, ఇది ఆరోగ్యాన్ని నాశనం చేయడంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో చక్కెర, శుద్ధి చేసిన పిండి, పామాయిల్ అధికంగా ఉంటాయి. ఇవి మీ గుండె ఆరోగ్యానికి చాలా హానికరం.
ఆరోగ్యకరమైన అల్పాహార ఎంపిక
వైద్యుల సలహా ప్రకారం .. ఒక ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎంపికలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు సమతుల్యంగా ఉండాలి. ఇడ్లీ, వెజిటబుల్ దాలియా, వెజిటబుల్ ఓట్స్, వెజిటబుల్ పోహా, పనీర్ శాండ్‌విచ్ లేదా మల్టీగ్రెయిన్ దాల్ కిచ్డి వంటివి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎంపికలు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.