/rtv/media/media_files/2025/11/27/animal-vs-plant-protien-2025-11-27-11-22-23.jpg)
Animal vs Plant Protien
ప్రొటీన్ మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాహారం. ఇది మనకు శక్తి, మసిల్(Muscle Building), శరీర అభివృద్ధి కోసం అవసరం. ప్రొటీన్ రెండు రకాలుగా లభిస్తుంది ప్లాంట్ ప్రొటీన్ (పప్పు, కాబూలీ, సోయా, వేరుశనగ, గింజలు), అనిమల్ ప్రొటీన్ (డెయిరీ, పన్నీర్, మాంసం, కోడి గుడ్లు, చేపలు). నిపుణుల అభిప్రాయం ప్రకారం, అనిమల్ ప్రొటీన్ ఎక్కువ బయోఅవైలబిలిటీ కలిగి ఉంటుంది. అంటే శరీరం దానిని సులభంగా గ్రహించగలదు. ఇది మసిల్ రిపేర్, శరీరానికి అవసరమైన 9 ఎసెన్షియల్ అమినో ఆమ్లాలను అందిస్తుంది.
Also Read: గినియా-బిస్సావులో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న సైన్యం.. అధ్యక్షుడు మిస్సింగ్
Animal vs Plant Protien
మరో వైపు, ప్లాంట్ ప్రొటీన్ ఎక్కువ ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్స్ అందిస్తుంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి, హార్ట్ సంబంధిత రోగాలు, షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ప్లాంట్ ప్రొటీన్ సాధారణంగా ‘ఇంకంప్లీట్’ అయినప్పటికీ, రొటీతో పప్పు, అన్నంతో డాల్ కలిపితే పూర్తి ప్రొటీన్ లభిస్తుంది.
Also Read: పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్..రికార్డ్ స్థాయిలో నిఫ్టీ
ఇంకా రేట్ల విషయంలో, పప్పులు, బీన్స్ వంటి ప్లాంట్ ప్రొటీన్లు తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొటీన్ అందిస్తాయి. అయితే, కొన్ని సార్లు ప్లాంట్ ప్రొటీన్ పొడులు తయారు చేయడానికి ఎక్కువ ప్రాసెసింగ్ అవ్వడం వల్ల ఖరీదైనవిగా మారతాయి. అనిమల్ ప్రొటీన్ కొన్ని సందర్భాల్లో ఖరీదైనవైనా, కొంచెం తిన్నా సరే శరీరానికి కావలసిన ప్రొటీన్ అందుతుంది.
Also Read: ఇంటర్నెట్ కేబుల్ వైర్ కట్ చేసిన అమెజాన్ డెలివరీ డ్రోన్.. వైరల్ వీడియో!
అయితే నిపుణులు ఈ రెండు రకాల ప్రోటీన్లను కలిపి వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయని సిఫార్సు చేస్తున్నారు
- ఉదయం: పాలు, పెరుగు, గుడ్లతో వేరుశనగ లేదా ఓట్స్
- మధ్యాహ్నం: డాల్ + రైస్ లేదా రొటీ, అవసరమైతే కొద్ది మాంసం లేదా చేప
- సాయంత్రం/స్నాక్స్: రోస్టెడ్ చానా, హ్యూమస్, లేదా బాయిల్ చేసిన గుడ్లు
- రాత్రి: పన్నీర్ లేదా టోఫూ కర్రీ, కొద్దిగా మాంసం లేదా చేప
Also Read: సైలెంట్ స్టార్ టూ బిలియనీర్.. ఒకే సినిమాతో కోట్లకి కోట్లు..!
ప్రొటీన్ చాలా ముఖ్యం, కానీ ప్లాంట్ లేదా అనిమల్ ప్రొటీన్ ఎంచుకోవడం వ్యక్తిగత జీవనశైలి, ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నిపుణులు సూచిస్తున్నది సమతుల్యతతో రెండు రకాల ప్రొటీన్ తీసుకోవడం. "ప్లాంట్ vs అనిమల్ కాదు, ప్లాంట్ & అనిమల్ ప్రోటీన్లను కలిపి మీ జీవనశైలికి అనుగుణంగా తీసుకోవాలి” అని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Follow Us