Aloe Vera: సర్వరోగాలకు నివారణ.. ఈ గ్రీన్ జ్యూస్ ఒక్కటే!

పోషక గుణాలు ఉన్న కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తాగితే సర్వరోగాలను నివారించవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల గుండె, ఎముకలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

New Update
aloe vera juice1

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కలబంద మొక్కను అందరూ ఇంట్లో పెంచుకుంటారు. ఈ కలబందతో జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే ఈ కలబంద జ్యూస్‌తో సర్వరోగాలను కూడా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డైలీ ఉదయం పూట కలబంద రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణ సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి

గుండె ఆరోగ్యం

ఉదయం లేదా సాయంత్రం వేళలో కలబంద జ్యూస్‌ను తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు పెరగకుండా అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా కలబంద రసం బాగా సహాయపడుతుంది. 

ఇది కూడా చూడండి:  ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’

జీర్ణ సమస్యలు
కొందరు అసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఈ జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మలబద్ధకం, ఇన్ఫెక్షన్ల బారి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. 

ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

ఎముకల ఆరోగ్యం
కలబందలో ఉండే ఎసిమన్నన్ ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, కండరాలు బలహీనత వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇవే కాకుండా చర్మం, జుట్టు సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. 

ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు