బీఆర్‌ఎస్‌ హటావో బీజేపీ బచావో

సీఎం కేసీఆర్‌పై పండరీ పూర్‌ ఎమ్మెల్యే సమాధన్‌ మహాదేవ్‌ ఔటాడే కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తెలంగాణలో ఏలాంటి అభివృద్ధి చేయాలేదు కానీ మహారాష్ట్రను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. మహారాష్ట్రకు రావాలని సూచించారు.

New Update
బీఆర్‌ఎస్‌ హటావో బీజేపీ బచావో

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హటావో బీజేపీ బచావో అని పండరీ పూర్‌ ఎమ్మెల్యే సమాధన్‌ మహాదేవ్‌ ఔటాడే పిలిపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా మానకొండూరులో బీజేపీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన పండరీ పూర్‌ ఎమ్మెల్యే సమాధన్‌ మహాదేవ్‌ ఔటాడే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రకు వచ్చి శివాజీ విగ్రహానికి పూల మాలలు వేస్తున్నారన్నారు. కానీ తెలంగాణలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

మహారాష్ట్రకు వచ్చిన కేసీఆర్‌ భారీ బహిరంగ సభలు పెట్టి మహారాష్ట్రను తెలంగాణలా తయారు చేస్తానని చెప్పారన్నారు. కానీ తాను ఇక్కడికి వచ్చి చూస్తే తెలంగాణనే మహారాష్ట్రలా మార్చినట్లు తెలిసిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ధరణి ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కేసీఆర్‌ ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పండరీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సరిహద్దు సమస్యలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆయన.. బీజేపీ సర్కార్‌ మాత్రం సరిహద్దు సమస్యలకు చెక్‌ పెట్టేందుకు రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు వెల్లడించారు.

తన సొంత రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్‌ పక్క రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇక్కడ చేస్తున్న అవినీతి చాలదని మహారాష్ట్ర మీద పడుతున్నారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ముందుగా తెలంగాణలో దళితులకు మూడెకురాల భూమి ఇవ్వాలని, రైతుబంధు సక్రమ మార్గంలో రైతులకు అందే విధంగా చూడాలని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు లబ్దిదారులకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఇదంతా చేసిన తర్వాతే కేసీఆర్‌ మహారాష్ట్రలో అడుగుపెట్టాలన్నారు. తన రాష్ట్రంలో హామీలను నెరవేర్చని కేసీఆర్‌.. పక్క రాష్ట్రంలో ఏం చేస్తారని ప్రశ్నించారు

ALSO READ: కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు