పీవీ నరసింహారావు జీవితం మనకు ఆదర్శం: కవిత
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు పట్వారీ నుంచి ప్రధానిగా ఎదిగిన తీరును కవిత వెల్లడించారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ శాఖ ద్వారా మానవ వనరులు ఏవిధంగా సృష్టించుకోవాలో ఆలోచించి రాను రాను ఆ శాఖకు కొత్త పదాలు జోడించారన్నారు.