Earth Quake: మయన్మార్, థాయ్ లాండ్ లలో 700 దాటిన మృతుల సంఖ్య
భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్లను అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 700 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్లను అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 700 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అమెరికాలోని ఉన్నత విద్య, పరిశోధనల కోసం అక్కడ యూనివర్సిటీలలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులకు బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్‌లను లైక్ చేసినా..షేర్ చేసినా వీసాలను రద్దు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
కోలకత్తాలో సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రి జూ.డాక్టర్ హత్యాచార ఘటనలో సీబీఐ కీలక రిపోర్ట్ ప్రవేశపెట్టింది. ఈ ఘటనలో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని..ఒక నేరస్థుడి ప్రమేయం మాత్రమే ఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసును ఛేదించేందుకు దాదాపు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 2, విజయవాడ-రాజమండ్రి మార్గంలో మరో 2 టీమ్స్ వివరాలను సేకరిస్తున్నాయి. మరో టీం ప్రవీణ్ ఫ్యామిలీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది.
ఛత్తీష్గడ్ సుక్మా జిల్లాలోని కెర్లపాల్ శనివారం భద్రతా బలగాలు, నక్సల్ మధ్య భీకర కాల్పులు జరిగాయి. శుక్రవారం నుంచి జిల్లా భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శనివారం ఉదయం జరిగిన భీకర కాల్పుల్లో 15 మంది మవోయిస్టులు మృతి చెందారు.
మయన్మార్ లో నిన్న 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో మృతుల సంఖ్య పెరుగుతోంది. దేశం మొత్తం దాదాపు అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో మయన్మార్ కు ఆపన్న హస్తం అందించేందుకు ఇండియా సిద్ధమైంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు.మోడీ గొప్ప ప్రధాన మంత్రి అంటూ ప్రశంసలు కురిపించారు.
ఉగాది పండుగ రోజు తెలిసో తెలియక కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. కొత్త ఏడాది నాడు ఇంటిని శుభ్రం చేయకూడదు, చిరిగిన దుస్తులు ధరించకూడదు, గొడవలు పడకూడదని పండితులు అంటున్నారు. ఇలా చేస్తే ఏడాదంతా కూడా మీకు దరిద్రమే.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ 2 సినిమా గురువారం విడుదల అయింది. మొదటిరోజు రూ.22 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం కాంగ్రెస్, బీజీపీల మధ్య కాంట్రవర్సీకి దారి తీస్తోంది.