Earth Quake: మయన్మార్, థాయ్ లాండ్ లలో 700 దాటిన మృతుల సంఖ్య

భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్లను అతలాకుతలం చేసింది.  ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 700 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

New Update
international

Mynmar Earth Quake

మయన్మార్, థాయ్ లాండ్ లలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 700 దాటింది. ఒక్క మయన్మార్ లోనే 690కు పైగా మరణించినట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ లో ఇప్పటివరకు 10 మంది చనిపోగా..ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ భారీ భూకంపం ధాటికి మొత్తంగా మృతుల సంఖ్య 10 వేలు దాకా అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ చెబుతోంది. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్‌లోని మాండలే నగరంలో జరిగిందని తెలుస్తోంది.  రెండు భూకంపాల కేంద్ర స్థానాలూ మాండలే నగరానికి సమీపంలోనే ఉన్నాయి. 

అతి పెద్ద భూకంపాలలో ఒకటి..

మయన్మార్ లో భూకంపం అక్కడి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది. ఒక్కసారిగా మీద వచ్చి పడిన విపత్తుతో జనం చెల్లాచెదురు అయిపోయారు. వందల్లో ప్రాణాలు పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ తో సహా చైనా, భారత్, వియత్నాం మరికొన్ని తూర్పు ఆసియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. అన్నిటి కంటే ఎక్కువగా థాయ్ లాండ్, మయన్మార్ దేశాలు ప్రభావితం అయ్యాయి. భారీగా ఇక్కడ భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇక్కడ ఒక్కచోటే దాదాపుగా 694 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది. మరో 1600 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇళ్ళఉ, భవనాలు కూలిపోవడంతో చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. 

 

today-latest-news-in-telugu | earth-quake | dead

Also Read: Kolkata: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు