🔴Live News Updates: మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు...
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలను ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడండి.
Feb 15, 2025 21:20 IST
మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు...
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. మహాకుంభమేళాలోని సెక్టార్ 18, 19ల మధ్య ఉన్న అనేక శిబిరాల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. అనేక గుడారాలు మంటల్లో చిక్కుకున్నాయి.పలు గుడారాలు కాలి బూడిదయ్యాయి.
Maha Kumbh Mela 2025
Feb 15, 2025 20:56 IST
కన్నీరు తెప్పించే విషాదం.. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన గన్ను మాధవకృష్ణ (48), సరిత సుమంగళి(43)గా గుర్తించారు. ఈ ఘటన పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట దగ్గర జరిగింది.
మహా కుంభమేళా గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తుల తాకిడి రోజు రోజుకు ఎక్కువ అవుతుందని.. అందుకే ఇంకొన్ని రోజులు కుంభమేళా నిర్వహించాలని కోరారు.
Akhilesh Yadav Requests Uttar Pradesh Government to Extend Date of Prayagraj Maha Kumbh Mela 2025 Photograph: (Akhilesh Yadav Requests Uttar Pradesh Government to Extend Date of Prayagraj Maha Kumbh Mela 2025)
Feb 15, 2025 20:29 IST
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో బైక్స్ స్కామ్స్.. ఓ ఎమ్మెల్యే హస్తం ?
హైదరాబాద్ లో బైక్ లు చోరీ జరిగాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి బీమా సొమ్మును క్లైమ్ చేస్తారు. ఆ తర్వాత బైక్ లనునిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో విక్రయిస్తున్నారు.మొత్తం 24 బైక్ లను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ఈ స్కాంలో ఓఎమ్మెల్యే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
Bike Scam
Feb 15, 2025 17:02 IST
వంశీని వదిలిపెట్టం.. అరెస్ట్ పై లోకేష్ ఫస్ట్ రియాక్షన్!
దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లాడని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు త్వరలో తెలుస్తాయన్నారు. వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Vallabhaneni Vamshi Nara Lokesh
Feb 15, 2025 16:06 IST
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం..ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్ననాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నిప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనిఎమ్మెల్సీకవిత అన్నారు. ఈరోజు కవిత ఖమ్మం సబ్ జైల్లోరిమాండ్‌లోఉన్నబీఆర్ఎస్ కార్యకర్త సురేందర్ ను పరామర్శించారు.
MLC Kavitha
Feb 15, 2025 15:00 IST
SPORTS: విడాకుల వార్తలు నిజం కావచ్చు: నోరు విప్పిన టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్!
టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్-ధనశ్రీ జంట విడిపోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో చాహల్ తన ఇన్ స్టాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు.
త్వరలో సీఎం మార్పు ఖాయమంటూ బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారని ఆయన జోస్యం చెప్పారు. దీపాదాస్ మున్షీని రేవంత్ మ్యానేజ్ చేస్తున్నారనే అధిష్టానం ఆమెను తప్పించిందని ఆరోపించారు.
తెలంగాణ సెక్రెటేరియట్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం రేపుతోంది. CMOతో సహా మంత్రుల పేషిలు, అధికారులకు నాసిరకం భోజనం సప్లై చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతిరోజూ ఫుడ్ తనిఖీ చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
tg Secretariat Photograph: (tg Secretariat)
Feb 15, 2025 08:57 IST
Maha Kumbh : మహాకుంభమేళాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
యూపీలోని ప్రయాగ్జ్- మీర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భక్తులతో వెళ్తున్న బొలెరో ఓ ట్రావెల్ ను బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది భక్తులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయి.
Feb 15, 2025 08:47 IST
BIG BREAKING : మాధవీలత బిగ్ ట్విస్ట్.. జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. జేసీపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. సినీ నటి మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. తనను కించపరిచేలా మాట్లాడారంటూ మాధవీలత ఫిర్యాదులో వెల్లడించింది.
Feb 15, 2025 08:29 IST
BREAKING : ఖమ్మం జైలుకు కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల అరెస్టై జిల్లా కారాగారంలో ఉన్న బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్‌ను పరామర్శించనున్నారు. అనంతరం సేవాలాల్ వేడుకల్లో పాల్గొనడంతోపాటు పార్టీ శ్రేణులతో భేటీ కానున్నారు.
BRS MLC Kavitha
Feb 15, 2025 07:54 IST
Delhi BJP : ఢిల్లీ సీఎం, మంత్రులు ఎవరు .. 15 మంది పేర్లు షార్ట్‌లిస్ట్!
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మోదీ అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకున్నారు. 15 మందితో కూడిన సీఎం, మంత్రుల లిస్టు రెడీ అయిపోయింది. ఇందులో 9 మందిని షార్ట్ లిస్టు రెడీ చేయనున్నారు.
Feb 15, 2025 06:29 IST
Home Minister : వల్లభనేని వంశీ అరెస్ట్..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!
వంశీ అరెస్టు అక్రమం కాదని సక్రమమేనని దానికి అన్ని ఆధారాలు ఉన్నాయని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత వివరించారు. కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు చెప్పినట్లు హోం మంత్రి తెలిపారు.