/rtv/media/media_files/2025/01/22/wGtpeymA8Q7ggbdVKiGD.jpg)
Republic Day
మరికొన్ని రోజుల్లో గణతంత్ర దినోత్సవం వేడుక జరగనుంది. ప్రతీఏడాది వివిధ దేశాలకు చెందని అధ్యక్షులు లేదా ప్రధానమంత్రులు ముఖ్య అతిథిగా ఈ వేడుకలకు హాజరవుతారు. అయితే ఈసారి కూడా మరో దేశానికి చెందిన అధ్యక్షుడు రానున్నారు. ఆయనే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో. జనవరి 26న కర్తవ్యపథ్‌లో జరగనున్న 76వ గణతంత్ర దినోత్స వేడుకలకు ఆయన రానున్నారు. అలాగే ఇండోనేషియాకు చెందిన 160 మంది సభ్యుల కవాతు టీమ్, 190 మంది సభ్యులతో కూడిన బ్యాండ్ టీమ్.. భారత సైనికులతో కలిసి కవాతు నిర్వహించనుంది. ఆ మేరకు భారత రక్షణశాఖ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించింది.
/rtv/media/media_files/2025/01/22/QR333zi6mhaw0vRqMdvR.jpg)
Also Read: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!
సాయుధ, పారమిలిటరీ, సహాయక పౌర బలగాలు అలాగే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ బృందాలు పరేడ్‌లో పాల్గొంటాయని అధికారులు తెలిపారు. దేశీయ వాయిద్యాలతోనే కళాకారులు దేశభక్తి గీతాలు ఆలపించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాండగా.. 1950 నుంచి భారత్‌లో నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకలకు వివిధ దేశాధినేతలను ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే 1952, 1953 అలాగే 1966 సంవత్సరాల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా వేడుకలు జరిపారు.
Also Read: గుడ్‌న్యూస్.. ఏఐ సాయంతో 48 గంటల్లో క్యాన్సర్‌కు వ్యాక్సిన్
2007 పుతిన్(రష్యా), 2008లో నికోలస్ సర్కోజీ (ఫ్రాన్స్) అతిథులుగా వచ్చారు. 2015లో ఒబామా(అమెరికా), 2016లో ఫ్రాన్సోయిస్ హోలన్ (ఫ్రాన్స్) ఈ వేడుకలకు హాజరయ్యారు. 2021లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినప్పటికీ కరోనా కేసులు పెరగడం వల్ల ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి హాజరయ్యారు. ఇక 2024 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ హాజరుకాగా.. 2025 వేడుకలు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.