Cancer Treatment: గుడ్‌న్యూస్‌.. ఏఐ సాయంతో 48 గంటల్లో క్యాన్సర్‌కు వ్యాక్సిన్

క్యాన్సర్‌ను నయం చేసే ఓ కృత్రిమ మేధ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆవిష్కరించారు. క్యాన్సర్‌ను గుర్తించిన 48 గంటల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సాయంతో వ్యాక్సిన్‌ను తయారుచేసి ఇవ్వొచ్చని పలు కంపెనీలు చెబుతున్నాయి.

New Update
Cancer and AI Technology

Cancer and AI Technology

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇలాంటి ప్రాణాంతకర వ్యాధిని నయం చేసే ఓ కృత్రిమ మేధ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒరాకిల్ సీటీఓ ల్యారీ ఎల్లిసన్‌, ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ సీఈఓ మసయోషి సన్‌ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్‌ను గుర్తించిన 48 గంటల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సాయంతో వ్యాక్సిన్‌ను తయారుచేసి ఇవ్వొచ్చని ఈ కంపెనీలు చెబుతున్నాయి. 

Also Read: జన్మతః పౌరసత్వం రద్దు.. కోర్టుల్లో సవాలు చేసిన 22 రాష్ట్రాలు

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒరాకిల్,సాఫ్ట్‌ బ్యాంక్‌, ఓపెన్‌ ఏఐ కంపెనీల భాగస్వామ్యంతో స్టార్‌గేట్‌ అనే వెంచర్‌ ప్రారంభమైంది. అయితే ఈ కొత్త కంపెనీ ద్వారా ఏఐ మౌళిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఈ ప్రాజెక్టు కింద టెక్సాస్‌లో  డేటా సెంటర్ల సాయంతో ఏఐలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఈ కంపెనీలు సిద్ధమవుతున్నాయి దీనికోసం టెక్సాస్‌లో 10 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. త్వరలో వీటి సంఖ్య 20కి పెరగనుంది.    

ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్ మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వల్ల అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ ఏఐ సాయంతో క్యాన్సర్‌ను వేగంగా గుర్తించడంతో పాటు దాన్ని నయం చేసే అవకాశం లభించనుందని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా స్వర్ణ యుగానికి ఈ ప్రాజెక్టు ఒక ఆరంభమని సాఫ్ట్‌ బ్యాంక్ సీఈవో మసయోషి తెలిపారు. 

Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!

ఆ తర్వాత ఒరాకిల్ సీఈవో ల్యారీ ఎల్లిసన్ మాట్లాడారు. '' క్యాన్సర్‌కు చెందిన చిన్న చిన్న ట్యూమర్స్‌ మానవ రక్తంలో తెలుతూ ఉంటాయి. ఏఐ సాయంతో వాటిని మనం ముందుగానే గుర్తించవచ్చు. దీంతో వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని క్యాన్సర్‌ను తొందరగానే నిర్ధారించుకోవచ్చు. ఆ కణాలకు గుర్తించిన తర్వాత ఆ వ్యక్తకి వ్యాక్సిన్ ఇవ్వాలి. వ్యాధి తీవ్రత ప్రకారం ఒక్కో వ్యక్తికి ప్రత్యేకంగా టీకాను అభివృద్ధి చేయాలి. అయితే MRNA వ్యాక్సిన్లను ఏఐ సాయంతో రోబోటిక్ సాంకేతికతను వినియోగించి 48 గంటల్లోనే తయారుచేసే వీలు ఉంటుందని'' తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు