🔴 LIVE NEWS: హైదరాబాద్‌లో చిరుత..ఏపీలో పులి..సంక్రాంతి వేళ హైటెన్షన్! By Manoj Varma 12 Jan 2025 | నవీకరించబడింది పై 12 Jan 2025 13:20 IST in Latest News In Telugu New Update breaking news షేర్ చేయండి Jan 12, 2025 13:20 IST హైదరాబాద్‌లో చిరుత..ఏపీలో పులి..సంక్రాంతి వేళ హైటెన్షన్! రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత కలకలం రేపింది. చిరుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి..చెట్లల్లోకి వెళ్లిది. చిరుత పాద ముద్రలు సైతం చూసిన మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. chirutha rajendranagar Photograph: (chirutha rajendranagar) Jan 12, 2025 11:50 IST సంక్రాంతికి ఏ పని తలపెట్టిన.. అసలు తిరుగే ఉండదు దాదాపుగా మూడేళ్ల తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి పండుగతో పాటు భౌమ పుష్య యోగం కూడా దాదాపు 19 ఏళ్ల తర్వాత రాబోతుంది. ఈ యోగంలో ఏ పని తలపెట్టిన కూడా అంతా విజయమే లభిస్తుందని పండితులు చెబుతున్నారు. Makar sankranthi festival Photograph: (Makar sankranthi festival) Jan 12, 2025 11:47 IST శబరిమల యాత్రికులకు ఉచిత ప్రమాద బీమా.. ఇలా చేస్తే రూ. 5లక్షలు శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే టీడీబీ యాత్రికుల కోసం ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చింది. పతనంతిట్ట, కొల్లాం, అలప్పుజా జిల్లాల పరిధిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తుంది. ఇందుకుగానూ ఎలాంటి రుసుము తీసుకోదు. sabarimala Temple Photograph: (sabarimala Temple) Jan 12, 2025 11:08 IST రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ కీలక మార్పు! రామ్ చరణ్ అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. 'గేమ్ ఛేంజర్' సినిమాలోని 'నానా హైరానా' పాటను యాడ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నేటి నుంచి థియేటర్స్ లో ఈ సాంగ్ తో కూడిన ప్రింట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. Nana Hyraanaa Song Added - Game Changer Jan 12, 2025 11:05 IST 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్ నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు. Jan 12, 2025 10:00 IST తెలంగాణలో నో మోర్ బెనిఫిట్ షోస్, టకెట్ల రేట్ల పెంపు సినిమా టికెట్ల రేట్లు పెంపు మీద తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. హైకోర్టు ఆదేశాల అనుగుణంగా ఇక మీదట బెనిఫిట్, స్పెషల్ షోస్, టికెట్ల రేట్లు పెంపు ఉండవని ప్రకటించింది. గేమ్ ఛేంజర్‌కు ఇచ్చిన అనుమతులనూ వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పింది. Telangana High Court Jan 12, 2025 09:59 IST రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇవ్వనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. Also Read : https://rtvlive.com/telangana/rythu-bharosa-will-distribute-from-january-26th-says-telangana-government-8611702 Jan 12, 2025 09:56 IST ఛీ.. ఛీ.. ఏం మనిషివిరా.. తిరుమలలో బ్యాంకు ఉద్యోగి దొంగతనం తిరుమలలో మరో దొంగతనం బయటపడింది. శ్రీవారి పరకామణి బంగారాన్ని ఓ బ్యాంకు ఉద్యోగి దొంగిలించి పట్టుబడ్డాడు. 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్యగా గుర్తించారు. tirumala employee Photograph: (tirumala employee) Jan 12, 2025 09:37 IST NTR, ప్రభాస్ ఎవరైనా సహాయం చెయ్యండయ్యా.. కోనఊపిరితో ఉన్నాను పావలా శ్యామల వీడియో చూస్తే కన్నీళ్లే నటి పావలా శ్యామల ప్రస్తుతం అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఎమోషనల్ వీడియో పెట్టారు. అయ్యా 50 ఏళ్ళు కష్టపడి నటిగా బ్రతికాను.. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. ఎవరైనా సహాయం చేయండయ్యా అంటూ తెలుగు హీరోలకు తన ఆవేదన వ్యక్తం చేశారు. pavala shyamala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి