Pavala Syamala: NTR, ప్రభాస్ ఎవరైనా సహాయం చేయండయ్యా .. కొనఊపిరితో పావలా శ్యామల వీడియో చూస్తే కన్నీళ్లే నటి పావలా శ్యామల ప్రస్తుతం అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలోఆమె ఓ ఎమోషనల్ వీడియో పెట్టారు. అయ్యా 50 ఏళ్ళు కష్టపడి నటిగా బ్రతికాను.. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. ఎవరైనా సహాయం చేయండయ్యా అంటూ తెలుగు హీరోలకు తన ఆవేదన వ్యక్తం చేశారు. By Archana 12 Jan 2025 in సినిమా Latest News In Telugu New Update pavala shyamala షేర్ చేయండి Pavala Syamala: ఒకప్పుడు సినిమాల్లో తన చలాకీ మాటలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పావలా శ్యామల ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉన్నారు. అనారోగ్య పరిస్థితులతో ఇండస్ట్రీకి దూరమైన ఆమె ఎంతో కష్టంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో పోరాడుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఈ క్రమంలో 'ఎవరైనా సాయం చేయండయ్యా' అంటూ నటి పావలా శ్యామల పెట్టిన దయనీయ వీడియో అభిమానులను కన్నీళ్లు పెట్టింస్తుంది. ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా సాయం కోసం నటి పావల శ్యామల అభ్యర్థన.. పాపం ఎలా వణుకుతుందో చూడండి ..For Donation Transfer to this Number:9849175713#PavalaShyamala #ViralVideo #RTV pic.twitter.com/ndLvfX5WwI — RTV (@RTVnewsnetwork) January 12, 2025 ఎన్టీఆర్, ప్రభాస్ సాయం చేయండయ్యా.. అయ్యా 50 ఏళ్ళు నటిగా కష్టపడి బ్రతికాను.. మూడు ఏళ్ళ నుంచి నా పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఈ విషయం ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను. కానీ ఎవరూ స్పందించలేదు. ఎలాగో ఇంతవరకు వచ్చాను.. కానీ ఇప్పుడు కొనఊపిరితో ఉన్నాను. దాదాపు 300 సినిమాలు చేశాను. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోల అందరితో సినిమాలు చేసి.. ఆఖరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాను. వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్నాను. నన్ను ఇలాగే వదిలేసి ఆత్మహత్య చేసుకునేలా చేస్తారా? దయచేసి నాకు సాయం చేయండయ్యా అంటూ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశారు నటి పావులా శ్యామల. Also Read: చంపడంలో పీహెచ్‌డీ.. మర్డర్లలో మాస్టర్స్ చేశా.. డాకు మహారాజ్ ఊరమాస్ రిలీజ్ ట్రైలర్! #pavala-shyamala #telugu-news #tollywood #latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి