తిరుమలలో మరో దొంగతనం బయటపడింది. శ్రీవారి పరకామణి బంగారాన్ని ఓ బ్యాంకు ఉద్యోగి దొంగిలించి పట్టుబడ్డాడు. 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్యగా గుర్తించారు. పెంచలయ్య చాలా తెలివిగా వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో బంగారాన్ని దాచిపెట్టాడు. పెంచలయ్యను విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పెంచలయ్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక వైకుంఠ ద్వార దర్శనానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారందరికీ దర్శనం కల్పిస్తామని, భక్తులందరూ సహకరించాలని టీటీడీ అధకారులు కోరుతున్నారు. కాగా శనివారం రోజున తిరుమల శ్రీవారిని 53 వేల 13 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 13 వేల 283 మంది భక్తులు తలనీలాలను సమర్పించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4. 43 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. జనవరి13వ తేదీకి సంబంధించిన శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీని టీటీడీ అధికారులు శనివారం రాత్రే ప్రారంభించారు. 13వ తేదీ నుంచి ఏ రోజుకారోజు టోకెన్లు జారీ చేస్తామని ముందుగానే టీటీడీ అధికారులు ప్రకటించారు. అయితే శనివారం రాత్రికే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మరోసారి తోపులాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు టికెట్ల జారీ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. Vaikunta Dwara Darshan SSD Token Issuance:Availability report of SSD tokens for 13-01-2025 from the counters at Tirupati(Bhudevi Complex, Vishnunivasam & Srinivasam) as of 09:11 AM today.#VaikuntaEkadasi#TTD#TTDevasthanams#TTDCPRO #TTDJan25 #TTDSocialMedia pic.twitter.com/jKmw4NkqEh — Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) January 12, 2025 Also Read : ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ కిల్లర్ ఫేక్ ష్యూరిటీలు