రాష్ట్ర విభజన మీద ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

New Update
రాష్ట్ర విభజన మీద ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

ఈరోజు మొదలైన పార్లమెంట్ ప్రత్యేకపమావేశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మోదీ ఇలా మాట్లాడ్డం మొదటి సారి కాదని కామెంట్ చేశారు. చారిత్రక వాస్తవాల పట్ల ఆనయకున్న నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. మోదీ తెలంగాణ విరోధి అని...పదే పదే తెలంగాణను ఏదో ఒకటి అంటూనే ఉంటారని కేటీఆర్ మండిపడ్డారు. అమృతకాల సమావేశాలు అని పేరు పెట్టి ఇలా విషం చిమ్మడం ఏం సంస్కారమని విమర్శించారు.

మోదీకి తెలంగాణ అంటే అంత గిట్టనితనేమిటో అర్ధం కాదు అంటూ విరుచుకుపడ్డారు కేటీఆర్. తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని ప్రశించారు. పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి సాధించుకున్న స్వరాష్ట్రం మీద మోదీకి ఎందుకంత చులకన భావం ఏంటో అర్ధం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీసారి పనిగట్టుకుని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తారు అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.

ఈడీ, ఐటీ, సీబీఐలను ఎన్డీయే కూటమిలో చేర్చుకుని ప్రతిపక్షాల మీద ఉసిగొల్పి ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగి పెట్టుకున్న మీకే పొద్దున లేచి ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం విచిత్రం అన్నారు కేటీఆర్. డబుల్ ఇంజిన్ నినాదంతో ఊదరగొట్టే మీకు తెలంగాణలో డబుల్ సీట్లు కూడా రావు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో బీజెపీ మళ్ళీ సెంచరీ కొట్టడం ఖాయం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు