/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/indian-team-jpg.webp)
KL Rahul in Asia Cup 2023: ఆసియా కప్(Asia Cup) స్క్వాడ్ అలా అనౌన్స్ చేశారో లేదో ఇలా బాంబు పేల్చారు సెలెక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్. దాదాపు నాలుగు నెలల తర్వాత గ్రౌండ్‌లో కనిపిస్తాడనుకున్న కేఎల్ రాహుల్(KL Rahul)కి మరోసారి గాయం అయ్యింది. నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో తాజాగా రాహుల్ గాయపడ్డాడని సమాచారం. దీని కారణంగా ఆసియా కప్‌లో మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ఇదే విషయాన్ని అజిత్ అగార్కర్(Ajit Agarkar) ధృవీకరించాడు. ఎన్‌సీఏ(NCA)లో కోలుకున్న సమయంలో కెఎల్ రాహుల్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడని, ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే టోర్నమెంట్‌లో అతను మొదటి కొన్ని గేమ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.
Latest insat story of KL Rahul❤❤
King is Ready for the Asia cup. #KLRahul pic.twitter.com/QAeqTgyyk9— SHUBHAM🚩 (@RAHUL__KL) August 20, 2023
గాయం నుంచి కోలుకున్నాడు కానీ..:
17 మందితో కూడిన భారత ఆసియా కప్ జట్టులో కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు కానీ ఇంతలోనే అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌ని కలవరపెడుతున్నాయి. అసలు రాహుల్ ఫిట్‌గానే ఉన్నాడా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేకుండా బరిలోకి దింపితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. గతంలో బుమ్రా(Bumrah) విషయంలోనూ బీసీసీఐ ఇలాంటి నిర్ణయాలే తీసుకుందని గుర్తు చేస్తున్నారు. నిజానికి బుమ్రాకు తొలిసారి గాయం ఐనప్పుడు పూర్తిగా కోలుకోకముందే తిరిగి జట్టులోకి తీసుకొచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే బుమ్రా గాయాలు పదేపదే తిరగబెట్టాయని ఫ్యాన్స్ చెబుతుంటారు. ప్రస్తుతం రాహుల్ విషయంలోనూ ఇదే తప్పు జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahull-iyer-jpg.webp)
Image source/twitter
ఈ ఏడాది ఐపీఎల్‌లో రాహుల్ గాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants) వర్సెస్ బెంగళూరు(Bangalore) మ్యాచ్‌లో రాహుల్‌కి ఇంజ్యురి అయ్యింది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తొడకు గాయం కావడంతో అతను ఆటకు దూరం అయ్యాడు. తర్వాత లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. మరోవైపు, శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయానికి సంబంధించి కూడా శస్త్రచికిత్స జరిగింది. అయ్యర్ గ్రౌండ్‌లో కనపడి చాలా కాలం దాటింది. తాజాగా అయ్యర్(Iyer)తో పాటు రాహుల్ కూడా తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వన్డే ప్రపంచ కప్ జరగడానికి మరి కొద్ది కాలమే సమయం ఉండడంతో ఈ ఇద్దరు ఎలా ఆడతారన్నదానిపై ఓ స్పష్టత రానుంది. మరోవైపు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తొలిసారిగా వన్డే జట్టులోకి ఎంపిక అయ్యాడు.
Also Read: జాక్‌పాట్ కొట్టిన తిలక్ వర్మ.. ఆసియా కప్ జట్టులో చోటు