ASIA CUP: టీమిండియాకు గట్టి షాక్.. మరోసారి ఆ స్టార్ ప్లేయర్‌కి గాయం!
టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి గాయపడ్డాడు. ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్ మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరం అవ్వనున్నాడు. ఎన్సీఏ(NCA)లో కోలుకున్న సమయంలో కేఎల్ రాహుల్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడని సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ తెలిపాడు.