Also read :మెట్రోలో పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్
ఈ మేరకు ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకత చాటుకోగా ఇప్పుడు ‘ ది ఆర్చీస్’ చిత్రంతో ఖుషీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ (Bollywood)బాద్ షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ కూడా నటిస్తోంది. ముంబైలోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో గత రాత్రి ఈ చిత్ర ప్రీమియర్ షో నిర్వహించారు. ఈ షోకు జాన్వీ కపూర్‌తో పాటు బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఇక ఈ షోలో ఖుషి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెకు తొలి చిత్రం కావడంతో సెంటిమెంట్‌గా తన తల్లి శ్రీదేవి డ్రెస్‌లో ఈవెంట్‌కు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బంగారు వర్ణంలోని స్ట్రాప్‌లెస్ గౌను ధరించి తన తల్లికి ప్రత్యేకమైన రీతిలో నివాళులర్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2013లో ఐఐఎఫ్ఏ అవార్డ్స్ వేడుకలో శ్రీదేవి ఇదే గౌను ధరించారు. రెడ్ కార్పెట్‌పై శ్రీదేవి ఈ గౌనుతో నడిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడిదే గౌనును ఖుషి ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు, తల్లి ఆభరణాలను కూడా వేసుకోవడం విశేషం.
ఇక షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్, ఖుషీ కపూర్, అమితాబ్ మనువడు అగస్త్య నంద ప్రధాన పాత్రల్లో అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ది ఆర్చీస్’ కు బాలీవుడ్ స్టార్ దర్శకురాలు జోయా అక్తర్ డైరెక్ట్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 7 ఈ సినిమా రిలీజ్ కానుంది.