మెట్రోలో పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్ ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు విచక్షణ మరిచి గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు వాటర్ చల్లుకుంటూ బూతులు తిట్టుకున్నారు. మాట మాట పెరిగి చెప్పులతో దాడి చేసుకున్నారు. వారిద్దరని తోటి ప్రయాణికులెవరూ ఆపేందుకు సాహసం చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. By srinivas 06 Dec 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Metro Video Viral : మెట్రో (Metro)లో ఓ ఇద్దరు యువతులు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్ తో దాడిచేసుకున్నారు. అంతటితో ఆగకుండా చెప్పులు చేతపట్టుకుని, బూతులు తిట్టుకుంటూ గొడవపడ్డారు. చూడటానికి చదువుకున్న అమ్మాయిల్లాగే కనిపిస్తున్న ఇంగిత జ్ఞానం మరిచి పశువుల్లా ప్రవర్తించారు. తోటి ప్రయాణికులు చూస్తున్నారనే ద్యాసే లేకుండా విచక్షణ మరిచి చెండాలంగా ప్రవర్తించారు. అయితే అదే బోగీలో ప్రయాణిస్తున్న వాళ్లేవరూ వారిద్దరి ఆపేందుకు ప్రయత్నించకపోగా వాళ్ల ఫైట్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Mohit Gulati (@desi_mojito) Also read :కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం ఆమెకే.. రేపే రేవంత్ సంతకం! ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ విచిత్రమైన సంఘటన ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న మెట్రోలో ఇద్దరు ఉద్యోగం చేసే మహిళలు ఏదో చిన్న విషయంలో గొడవపడ్డారు. దీంతో మాటమాట పెరిగి వాదనకు దిగారు. దీంతో అది కాస్త దాడులు చేసుకునేంత వరకూ వచ్చింది. మిగిలి వారతంతా ఏమీ అర్థం కాని స్థితిలో చూస్తుండి పోయారు. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ విచక్షణ మరిచి ఫైటింగ్ చేశారు. వాటర్ చల్లుకుంటూ గొడవపడ్డారు. ముందుగా ఓ మహిళ ఎదుటి మహిళపై బాటిల్‌తో నీళ్లు చల్లేందుకు చూసింది. దానికి ప్రతిదాడిగా ఎదుటి మహిళ తన చెప్పులు తీసి దాడికి దిగింది. ఆ తర్వాత ఇద్దరూ జుట్టు పట్టకుని కొట్టుకునేందుకు ట్రై చేశారు. ఇదంతా వీడియో తీసిన కొందరు మెట్రో ప్రయాణికులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. #fight #girls-fight #metro #delhi #delhi-metro #metro-video-viral #girls మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి