Kesineni Chinni : కేశినేని నాని(Kesineni Nani) రాజీనామాతో విజయవాడ పాలిటిక్స్(Vijayawada Politics) హీటెక్కాయి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 60 శాతం టీడీపీ(TDP) ని ఖాళీ చేస్తానని నాని ఛాలెంజ్ చేయడం, అన్నదమ్ముల వార్‌తో టీడీపీ క్యాడర్ అయోమయంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో కేశినేని నాని తమ్ముడు చిన్ని(Chinni) చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కేవినేని చిన్న ఆర్టీవీ(RTV) కి ఎక్సక్లూజివ్ ఇంటర్వే ఇచ్చారు. ఇందులో మా కుటుంబంలో చాలా కాలం నుండి గొడవలు ఉన్నాయని చిన్ని చెబుతున్నారు. కేశినేని నాని టీడీపీ నుంచి వెళ్ళిపోవడంతో మా కుటుంబం లో ఉన్న ఒకే ఒక్క సమస్య తీరిపోయిందని అన్నారు. మా గొడవలకు చంద్రబాబుకు సంబంధమేమిటని ప్రశ్నించారు. నాని చేసిన వాటన్నింటికీ చంద్రబాబు(Chandrababu) కి మా కుటుంబం నుండి క్షమాపణ చెప్పుకొంటున్నాను. ఎవరో ఒకరు ఇద్దరు అనాముకులు నాని తో వెళ్తే పార్టీ కి ఏమీ నష్టం లేదని...విజయవాడ ప్రజలు టీడీపీ వైపే వున్నారని చిన్ని వ్యాఖ్యానించారు.
Also read:మణిపూర్‌లో మళ్ళీ కాల్పులు..నలుగురు అదృశ్యం..రాహుల్ న్యాయ యాత్ర డౌటే..
టీడీపికి వచ్చిన నష్టమేమీ లేదు...
నాని విలువలు కోల్పోయాడని చిన్న మండిపడ్డారు. నానీ అన్నీ అబద్ధాలే చెబుతున్నాడు.. అసలు అతను 2వేల కోట్ల ఎలా నష్ట పోయాడు..? 2014 ఆఫీడివిట్ లో చూస్తే తెలుస్తుంది... ఆయన మీద ఉన్న కేసులు, ఆస్తులు గురించి నానీ చెప్పినట్టు 60 శాతం టీడీపీ ఖాళీ కావడం కాదు.. 70 శాతం వైసీపీ(YCP) ఖాళీ అవుతుందని చిన్ని వ్యాఖ్యానించారు. నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మరచి మాట్లాడటం తగదు. పార్టీ ఎవరిని అభ్యర్థి గా ప్రకటిస్తే వాళ్ళు విజయవాడ ఎంపీ గా పోటీ చేస్తారు. లక్షన్నర మెజారిటీ తో విజయవాడ పార్లమెంటు లో టీడీపీ గెలుస్తుందని నమ్మకంగా చెప్పారు.